వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం: జాగ్రత్త, సాయం చేసే వారికి మనీషా కోయిరాల హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్/న్యూఢిల్లీ: నేపాల్ భూకంపం నేపథ్యంలో సహాయం చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రముఖ నటి మనీషా కోయిరాలా సూచనలు చేశారు. భారీ భూకంపం నేపథ్యంలో చాలామంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆమె అన్నారు. ఇదే సమయాన్ని చాలామంది దీనిని మిస్ యూజ్ చేసుకునేందుకు ఉపయోగించుకుంటారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

నేపాల్ పునరావాసం కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారి నుండి డబ్బులు వసూలు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత వాటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చాలా సంస్థలు ఇలాంటి సమయాన్ని మిస్ యూజ్ చేసేందుకు ఉపయోగించుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇవ్వాలని కోరారు.

నేపాల్లో ఆహారం, నీటికి చాలా ఇబ్బంది ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సహకరించేందుకు అందరూ ముందుకు రావాలని ఆమె కోరారు. ఎవరైనా లేదా సంస్థలు ఫండ్స్‌ను, ఆహారాన్ని, ఇతర వస్తువులను మిస్ యూజ్ చేస్తే అది సరికాదని, వారు తప్పకుండా శిక్షించబడతారని, ప్లీజ్ ప్రజల కష్టాన్ని గుర్తించి మిస్ యూజ్ చేయవద్దని ఆమె కోరారు. నేపాల్ దేశానికి చెందిన మనీషా భూకంపం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Check accountability, then donate for earthquake-hit Nepal: Manisha Koirala

మూడు రోజుల క్రితం భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ పట్ల భారత ప్రభుత్వం చూపిస్తున్న చొరవను ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా స్పందించారు. ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ భూకంపై పైన వేగంగా స్పందించిన భారత్ తీరు నేపాలీయుల హృదాయలను తాకిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా మనీషా కోయిరాలా స్పందించారు.

తమ దేశాన్ని ఆదుకునేందుకు మోడీ స్పందించిన తీరు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అన్నారు. భూకంపం తర్వాత నేపాల్‌ను చూసి తనకు కన్నీళ్లు ఆగలేదన్నారు. నేపాల్‌ను ఆదుకుంటున్న భారత్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మోడీ గారు ఇంత త్వరగా స్పందించి చేసిన సాయాన్ని తాము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్నారు.

English summary
Manisha Koirala, who has roots in Nepal, is saddened by the machinations of some people who are trying to make money by misusing relief funds meant for earthquake-hit Nepal. The actress has advised people to be cautious of such organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X