అనగనగా ఓ అంధుడు, అతనికి ఆరు మంది భార్యలు, విదేశాల్లో ఉద్యోగాలు, అమ్మాయిలతో రాసలీలలు!
చెన్నై: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి చేతికి అందినంత డబ్బులు వసూలు చేసుకున్న ఓ అంధుడు అమ్మాయిలు, మహిళలతో రాసలీలు సాగిస్తున్నాడు. అమాయకుల నుంచి రూ. సుమారు 50 లక్షలకు పైగా వసూలు చేసిన ఆ అంధుడు ఆరు మంది మహిళలను వివాహం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అంధుడి అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు సైతం షాక్ కు గురైనారు.

బస్సుల్లో పరిచయాలు
తమిళనాడులోని ధర్మపురి జిల్లా మొరప్పూర్ కు చెందిన డేవిడ్ (40) అంధుడు. డేవిడ్ వివిద ప్రాంతాలకు బస్సుల్లో సంచరిస్తున్నాడు. చెన్నైలోని అమ్మాపేట్ కు చెందిన ఆసిఫ్ ఆలీ కొంతకాలం క్రితం బెంగళూరు నుంచి చెన్నైకి ప్రయాణించాడు. ఆ సమయంలో ఆసీఫ్ ఆలీకి డేవిడ్ పరిచయం అయ్యాడు.

విదేశాల్లో ఉద్యోగాలు
డేవిడ్ అంధుడు కావడంతో బస్సులో ఓ మహిళ లేచి అతనికి సీటు ఇచ్చింది. తరువాత భోజనానికి బస్సు నిలిపిన సమయంలో డేవిడ్, ఆరీఫ్ ఆలీ కలిసి భోజనం చేశారు. ఆ సందర్బంలో తాను ఉద్యోగం కోసం వేతుకుతున్నానని, మంచి ఉద్యోగం వస్తే మా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుందని ఆరీఫ్ ఆలీ డేవిడ్ కు దగ్గర వాపోయాడు. ఆ సమయంలో కొంచెం డబ్బులు ఖర్చు చేస్తే తానకు పరిచయం ఉంటూ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి చెప్పి మీకు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని డేవిడ్ ఆరీఫ్ ఆలీకి మాయమాటలు చెప్పాడు.

రూ. లక్షలు వసూలు
ఆరీఫ్ ఆలీతో డేవిడ్ టచ్ లో ఉన్నాడు. తరువాత విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన డేవిడ్ ఆరీఫ్ ఆలీ దగ్గర సుమారు రూ. 7 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఎంత కాలానికి ఉద్యోగం రాకపోవడంతో ఆరీఫ్ ఆలీ డేవిడ్ ను నిలదీశాడు. తాను అంధుడని, నువ్వు నా మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోరని, నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ డేవిడ్ ఎదురుతిరిగాడు.

ఘరానామోసగాడు
ఆరీఫ్ ఆలీ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన సూరమంగళం పోలీసులు విచారణ చేసి డేవిడ్ ను అదుపులోకి తీసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మాయమాటలు చెప్పి ఆరీఫ్ ఆలీతో పాటు నాగరాజ్, సెల్వంతో పాటు 7 మంది దగ్గర సుమారు రూ. 50 లక్షలకు పైగా వసూలు చేసిన డేవిడ్ వారిని మోసం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అంధుడికి ఆరు మంది భార్యలు
నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని వారిని మోసం చేసి వసూలు చేసిన డబ్బుతో తాను ఇప్పటి వరకు ఆరు మందిని వివాహం చేసుకున్నానని డేవిడ్ అంగీకరించడంతో పోలీసులు షాక్ కు గురైనారు. ప్రస్తుతం తాను మొరాపూర్ లోని ఓ భార్యతో కలిసి నివాసం ఉంటున్నానని డేవిడ్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు.

అమ్మాయిలతో రాసలీలలు
ఉద్దరగా వచ్చిన డబ్బుతో డేవిడ్ అనేక మంది పేద అమ్మాయిలు, మహిళలకు వల వేశాడని, వారితో రాసలీలలు సాగించి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి ఎంజాయ్ చేస్తున్నాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డేవిడ్ ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేశాడు అని ఆరా తీస్తున్నామని, న్యాయమూర్తి ఆదేశాలతో అతన్ని సేలం సెంట్రల్ జైలుకు తరలించామని సూరమంగళం పోలీసులు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications