Wife: భార్యకు తెలీకుండా ఇల్లు అమ్మేసిన భర్త, గ్యాస్ సిలిండర్ లీక్, కిరోసిన్ పోసుకుని, చుక్కలు !
భార్యకు తెలీకుండా భర్త అతని ఇంటిని అమ్మేశాడు. ఇల్లు కొనుగోలు చేసిన వాళ్లు ఆఇంటిలోకి చొరబడి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి శరీరం మీద కిరోసిన్ పోసుకుని నానా హంగామా చేశారు.
చెన్నై/కన్యాకుమారి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాడు. కన్నతల్లి కూడా అతని ఇంటిలోనే ఉంటున్నది. సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తితో అతను చాలా క్లోజ్ గా ఉన్నాడు. భార్యకు తెలీకుండా భర్త అతని ఇంటిని అమ్మేశాడు. ఇల్లు కొనుగోలు చేసిన వాళ్లు ఆఇంటిలోకి చొరబడి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి శరీరం మీద కిరోసిన్ పోసుకుని నానా హంగామా చేశారు. మాకు ఇల్లు అప్పగించండి, లేదా మా డబ్బులు మాకు ఇప్పించాలని చేసిన హంగామాతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో. గ్యాస్ సిలండర్ ఎక్కడ పేలిపోతుందో అంటూ అర్దరోజు హైడ్రామా నడిచింది.

రూ. 12 లక్షలకు ఇల్లు అమ్మేశాడు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మీనాచల్ ప్రాంతంలో సోము(45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోము అతని భార్య, ఇద్దరు కుమారులు, తల్లి సరోజినితో కలిసి సొంత ఇంటిలో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సోము తన తల్లి సరోజినితో కలిసి తాము నివాసముంటున్న ఇంటిని భార్యా, పిల్లలకు తెలియకుండా సమీపంలో నివాసం ఉంటున్నమణికందన్‌కు రూ. 12 లక్షల రూపాయలకు విక్రయించాడు. కొద్దిరోజుల తరువాత సోము భార్య పెనిలాకు ఈ విషయం తెలిసి కలియకవిల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పంచాయితీలు చేసిన పోలీసులు
దీంతో పోలీసులు ఇంటిని కొనుగోలు మణికందన్, ఇల్లు విక్రయించిన సోమును కలియకవిల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పంచాయితీలు చేశారు. భార్యకు తెలియకుండా ఇల్లు విక్రయించడం, కొనుగోలు చెయ్యడం తప్పేనని ఇద్దరూ అంగీకరించారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని మణికందన్ పోలీసులకు మనవి చేశారు. అందుకు అంగీకరించిన మణికందన్ డబ్బు తిరిగి ఇచ్చేందుకు కొన్ని రోజుల సమయం ఇచ్చి, పోలీస్ స్టేషన్ లో సోము నుంచి లిఖితపూర్వకంగా రాపించుకుని సంతకం తీసుకున్నాడు.

డబ్బులు లేవు, ఇల్లు లేదని ?
అయితే సోము డబ్బులు తిరిగి ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు. ఈ సందర్భంలో ఇల్లు కొనుగోలు చేసిన మణికందన్ సోము, అతని తల్లి లేకపోవడం, డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. సోము భార్య బేనీలా, ఆమె పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ తతంగం జరిగింది. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు మణికందన్‌ను అడ్డుకుని బెనిలాకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన బెనీలా ఇల్లు అమ్మిన వివరాలు తమకు తెలియవని, మా ఇంటిలోకి వెళ్లకూడదని మణికందన్ కు చెప్పింది.

గ్యాస్ సిలిండర్ లీక్ చేసి హంగామా
గొడవ పెద్దది కావడంతో మణికందన్, అతని భార్య మీనా కలిసి సోము ఇంట్లోకి చొరబడి లోపలు తలుపులు వేసి వంట గ్యాస్ సిలిండర్ లీక్ చేశారు. తరువాత మణికందన్, మీనా ఇద్దరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 10 గంటలపాటు మణికందన్, మీనా దంపతులతో చర్చలు జరిపారు. అయినా వాళ్లు మాత్రం డోర్ లాక్ తియ్యలేదు. చివరికి పోలీసులు తలుపులు పగులగొట్టి వారిని సురక్షితంగా రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న సోము కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ హంగామాతో ఎక్కడ గ్యాస్ సిలిండర్ పేలిపోతుందో అని ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications