సోషల్ మీడియా ఫ్రెండ్స్, న్యూడ్ వీడియో కాల్స్, మ్యాటర్ విదేశాలు తిరిగేసింది !
చెన్నై/పుదుచ్చేరి/దుబాయ్: సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న ఓ యువతికి ఓ యువకుడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరు టచ్ లో ఉన్నారు. ఐ లవ్ యూ అంటూ యువకుడు చెప్పాడంతో ఆమె ప్రేమించడానికి నిరాకరించింది. తరువాత చాలా జరిగింది. యువతి నగ్న వీడియో కాల్స్ అడ్డం పెట్టుకున్న యువకుడు విదేశాల నుంచి ఆ యువతి జీవితంతో ఎలా గేమ్స్ ఆడుకున్నాడంటే ?
పుదుచ్చేరికి చెందిన ఓ యువతితో చెన్నైకి చెందిన దిలీప్ కుమార్ అనే యవకుడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరూ సోషల్ మీడియాలో దగ్గరయ్యారు. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మొదలైన సోషల్ మీడియాలో గ్రూప్స్ లో పరస్పరం వారి వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకుంటున్నారు.

కొన్ని వారాల తర్వాత ఆన్‌లైన్‌లో పరిచయమైన చెన్నైకి చెందిన దిలీప్ కుమార్ ఆ యువతికి ఐ లవ్ యూ చెప్పాడు. అయితే ఇది సరికాదని, మనం ప్రేమించుకోవడానికి వీలుకాదని, మనం స్నేహితులుగా ఉందామని, అలా అయితే మనం టచ్ లో ఉందామని ఆ యువతి దిలీప్ కుమార్ కు తేల్చి చెప్పింది. ఇదే విషయంలో పుదుచ్చేరి యువతి మీద దిలీప్ కుమార్ పగ పెంచుకున్నాడు.
దిలీప్ కుమార్ సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ ను వేధించడం ప్రారంభించాడు. నాతో మాట్లాడకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, చేయి కోసుకుంటానని యువతిని బెదిరించాడు. ఆ యువతి ఆమె వాడుతున్న సిమ్ కార్డును తీసేసి వేరే ఫోన్ నెంబర్ తీసుకుంది. అయితే అప్పటికే ఇద్దరి మధ్య తేడాలు రావడంతో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది.
వారిద్దరూ కలిసి సంతోషంగా ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకుంటున్న సమయంలో ఆ యువతి ఆమె కొందరు స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్‌ను దిలీప్ కుమార్‌కు ఇచ్చింది. సిమ్ కార్డు మార్చేసి వేరే ఫోన్ నెంబర్ తీసుకున్న యువతి మీద దిలీప్ కుమార్ రగిలిపోయాడు. యువతిని టచ్ లోకి తీసుకోవాలని దిలీప్ కుమార్ అనేక ప్రయత్నాలు చేశాడు.

అయితే యువతి మాత్రం దిలీప్ కుమార్ కు టచ్ లోకి రాలేదు. అంతే ఆవేశంతో ఊగిపోయిన దిలీప్ కుమార్ పవర్ ఫుల్ స్కెచ్ వేశాడు. పుదుచ్చేరి సోషల్ మీడియా ప్రియురాలు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆ యువతి గురించి చాలా నీచంగా, బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. విషయం తెలియగానే భయపడిన యువతి దిలీప్ కుమార్‌ను సంప్రదించి ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించింది.
ఇక నేను మీతో మాట్లాడకూడదనుకున్నాను అని ఆ యువతి చెప్పింది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనుకుంటే నేను చెప్పినట్లు వీడియో కాల్‌లో వచ్చి నాతో మాట్లాడితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని దిలీప్ కుమార్ ఆ యువతికి చెప్పాడు. యువకుడి మాయమాటలు నమ్మిన యువతి న్యూడ్ గా వీడియో కాల్ లో దిలీప్ కుమార్ తో మాట్లాడింది.
ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న దిలీప్ కుమార్ న్యూడ్ వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ రికార్డ్ చేసి ఆ యువతిని మరింత బెదిరించడం ప్రారంభించాడు. నువ్వు నాతో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు మాట్లాడకుంటే ఈ వీడియోను మీ బంధువులు, స్నేహితులందరికీ పంపిస్తానని బెదిరించాడు. యువతి న్యూడ్ కాల్ లో మాట్లాడిన సమయంలో తీసిన స్క్రీన్ షాట్ తీసి అమ్మాయికి పంపించి ఆమెను వేధించడం ప్రారంభించాడు.
దీంతో భయపడిన యువతి పోలీస్ స్టేషన్‌కు వచ్చి కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పుదుచ్చేరి పోలీసులు దిలీప్‌కుమార్ కోసం వెతికారు. దిలీప్ కుమార్ ఇంటర్నెట్‌ను ఎక్కడ నుండి ఉపయోగిస్తాడు. యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను ఎక్కడ అప్‌లోడ్ చేశాడనే వివరాలను సేకరించారు. అయితే దిలీప్ కుమార్ దుబాయ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల విచారణలో దిలీప్ కుమార్ దుబాయ్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. దిలీప్‌కుమార్‌పై కేసు నమోదు కావడంతో అతను విదేశాలకు వెళ్లేందుకు సహకరించిన కంపెనీకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ కార్తికేయ సమాచారం అందించారు. ఈ సమాచారం తెలిపిన వారం రోజుల్లోనే దిలీప్‌కుమార్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు పంపించారు. ఆ తర్వాత పుదుచ్చేరి, తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పుదుచ్చేరికి తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు. కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications