'మైనర్ బాలికకు 'I Love You' చెప్పడం తప్పు కాదు'.. హైకోర్టు సంచలన తీర్పు

ఛత్తీస్ గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మైనర్ అమ్మాయికి 'I Love You' చెప్పడం లైంగిక వేధింపుల కిందకు రాదని.. అలాంటి వాటికి పోక్సో చట్టం వర్తించదని పేర్కొంది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ కేసును విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. పోక్సో చట్టం,2012 లోని సెక్షన్ 7 కిందకు ఈ కేసు రాదని తెలిపింది. అయితే లైంగికంగా వేధించాలన్న కోరికతో ఇలా చేస్తే మాత్రం పరిగణలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మైనర్ బాలికకు 'I Love You' చెప్పడం లైంగిక వేధింపుల కిందకు రాదని ఛత్తీస్ గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ పదాల వెనక లైంగిక వాంఛ ఉన్నట్లు నిరూపితం కాలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది పోక్సో చట్టం కిందకు రాదని తెలిపింది. ఈ మేరకు మైనర్ బాలికకు 'I Love You' చెప్పిన నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించింది హైకోర్టు ధర్మాసనం.పోక్సో చట్టం,2012 లోని సెక్షన్ 7 కిందకు ఈ కేసు రాదని తెలిపింది. ఒకవేళ నిందితుడు లైంగికంగా వేధించాలన్న కోరికతో ఇలా చేస్తే మాత్రం పరిగణలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాంటి ఆధారాలేవీ రుజువు కాలేదని ఈ మేరకు నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కీలక తీర్పును వెల్లడించింది హైకోర్టు ధర్మాసనం.

Chhattisgarh HC Saying I Love You to Minor Not Sexual Harassment Without Intent

2019 అక్టోబర్ 15న ఈ కేసు ఫైల్ అయింది. ఓ 15 ఏళ్ల విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు ఆమెకు 'ఐ లవ్ యూ' చెప్పాడు. దీంతో విద్యార్థిని స్కూల్​లో ఆ యువకుడిపై కంప్లెయింట్ ఇచ్చింది. అలాగే విద్యార్థిని ఫిర్యాదు మేరకు అలాగే యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ట్రయల్ కోర్టు యువకుడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ హైకోర్టులో సవాల్ చేసింది. తాజాగా హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+