ఎముకలు విరిచి, గుండె బయటికి తీసి-జర్నలిస్ట్ దారుణ హత్య-హైదరాబాద్ లో అరెస్ట్..!
ఛత్తీస్ ఘడ్ లోని బీజపూర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ ముకేష్ చంద్రశేఖర్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ముకేష్ ను నిందితుడు అత్యంత దారుణంగా హతమార్చారని అతని శవపరీక్ష నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన సురేశ్ చంద్రశేఖర్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుంది. మరోవైపు అటాప్సీ నివేదికలో వెలుగుచూసిన అంశాలు చూస్తే ఈ హత్య ఎంత పాశవికంగా జరిగిందో అర్థమవుతోంది.
జనవరి 3న జరిగిన ముకేష్ చంద్రశేఖర్ హత్య తర్వాత ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్ చంద్రశేఖర్ కు సోదరులైన రితేష్ చంద్రశేఖర్, దినేష్ చంద్రశేఖర్, వారి డ్రైవర్ మహేంద్ర రాంటెకేను అరెస్టు చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రధాన నిందితుడు సురేశ్ చంద్రశేఖర్ ను కూడా అరెస్టు చేశారు. నిన్న రాత్రి అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ కు అతన్ని తరలించారు.

స్వతంత్ర జర్నలిస్టు అయిన ముకేష్ చంద్రశేఖర్ జనవరి 1న అదృశ్యమయ్యాడు. జనవరి 3న అతని శవం బీజపూర్ నగరంలోని ఛత్తన్ పారా బస్తీలో ఉన్న సురేశ్ చంద్రశేఖర్ కు చెందిన స్ధలంలోని సెప్టిక్ ట్యాంకులో దొరికింది. ఛత్తీస్ ఘడ్ లో ఓ రోడ్డు నిర్మాణ పనికి సంబంధించిన వార్తల ప్రచురణే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం నిందితులను కస్టడీలో విచారించిన తర్వాతే అసలు విషయాలు బయటపెట్టబోతున్నారు. కీలక నిందితుడు సురేశ్ చంద్రశేఖర్ అరెస్టు నేపథ్యంలో అతన్ని ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు.
మరోవైపు ముకేష్ చంద్రశేఖర్ పోస్ట్‌మార్టం పరీక్షలో ఈ హత్య ఎంత దారుణంగా జరిగిందో వైద్యులు గుర్తించారు. మృతుడి తలపై 15 పగుళ్లు ఉన్నట్లు తేల్చారు. అలాగే అతని మెడ విరిగిపోయిందని, అతని గుండె బయటకు వచ్చినట్లు కూడా గుర్తించారు.ప్రధాన నిందితుడైన సురేశ్ చంద్రశేఖర్ ఓ రోడ్డు కాంట్రాక్టర్. అతనితో ఉన్న విభేదాలతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications