గ్యాంగ్ రేప్: వికృత చర్య, నగ్నంగా ఉరేసుకున్న బాలిక

రాయ్‌పూర్: ఛత్తీస్‌గడ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నంగా ఇంటికెళ్లమంటూ కొందరు యువకులు వికృతంగా ప్రవర్తించడంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... డిసెంబర్ 29న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఛత్తీస్‌గడ్‌లోని తెండా నబాపరా గ్రామానికి చెందిన బాలిక (15) స్నేహితులతో కలిసి సమీప గ్రామంలోని సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా వారిని ఐదుగురు యువకులు వెంబడించారు. బాలిక స్నేహితులను చితకొట్టి, ఆమెను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

Chhattisgarh: Told to go home naked, rape victim ends life

అంతటితో ఆగకుండా నగ్నంగా ఇంటికి వెళ్లాలని సూచించారు. అనంతరం బాలిక దుస్తులు, ఇతర వస్తువులను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక బాలిక సంఘటనా స్థలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఇద్దరు టీనేజర్లు, ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+