వైరల్ వీడియో: 25 సెకన్లలో 20 దెబ్బలు.. ఇదేం ఏం కొట్టుడు సామి..
దొంగతనాలు నానా రకాలుగా మారిపోతున్నాయి. చోరీల్లోనూ ఎప్పటికప్పడు అప్డేట్ అవుతున్నారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ జ్యూవెలరీ షాపులోకి నగలు కొనేందుకు వచ్చిన మహిళ.. షాపు యజమానిపై కారం పొడి చల్లి దొంగతనానికి యత్నించింది. అయితే ఆమె పన్నాగాన్ని పసిగట్టిన ఆ యజమాని మహిళపై దాడికి పాల్పడ్డాడు. పొట్టుపొట్టు కొట్టాడు. 25 సెకన్ల వ్యవధిలో 20 చెంప దెబ్బలు బాదాడు. అంతేకాక ఆ మహిళను జుట్టు పట్టుకుని బయటకు గుంజుతున్నట్లు వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. చోరీ చేసేందుకు ఓ మహిళ.. రణిప్ వెజిటేబుల్ మార్కెట్ లోని ఓ జ్యువెలరీ షాపులోకి ప్రవేశించింది. మహిళ తన ముఖాన్ని దుపట్టాతో కవరింగ్ చేసుకుంది. కస్టమర్ గా నటించి బంగారు ఆభరణాలను కాజేయాలని ప్లాన్ వేసింది. కొద్దిసేపు ఆభరణాలు చూస్తున్నట్లుగా నటించి షాపు యజమానిపై కారం పొడి చల్లింది. అయితే వెంటనే పక్కకు తప్పుకున్న అతడు.. యువతి ప్లాన్ గ్రహించి ఆమెపై దాడి చేశాడు. చెంపలు చెళ్లుమనేలా ఏకధాటిగా కొట్టడం ప్రారంభించాడు. అలా 25 సెకన్ల వ్యవధిలోనే 20 సార్లు చెంప దెబ్బలు కొట్టాడు. మహిళ జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
In Ahmedabad, a woman tried to rob a jewelry store owner by throwing red chili powder into his eyes.
— 🦋 KOMAL SINGH🦋 💯 Follow Back (@Singh_Komall) November 7, 2025
Even after the chili got into his eyes, the owner stood strong.
#IPL2026 #Kumbha #Fourthnattawat pic.twitter.com/rAqmVDlVpo
వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే ఈ ఘటనపై షాపు యజమాని ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కానీ సీసీటీవీ ఫూటేజీ కారణంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళను త్వరలోనే గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇదే ఘటనపై అహ్మదాబాద్ పోలీసులు.. షాపు యజమానిని రెండు సార్లు కలిశామని తెలిపారు. ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా సూచించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే షాపు యజమాని మాత్రం ఫిర్యాదు చేసేందుకు నిరాకరిస్తున్నాడని తెలిపారు. కానీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా మహిళ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications