గుండెల్ని పిండేసే విషాదం: పేలిన చిప్స్ ప్యాకెట్.. పోయిన కంటిచూపు!
సాధారణంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ ప్యాకెట్ ఓ 8 ఏళ్ల బాలుడి జీవితంలో చీకట్లు నింపింది. చిప్స్ ప్యాకెట్ ఒక్కసారిగా పేలడంతో ఆ చిన్నారి కంటిచూపును శాశ్వతంగా కోల్పోయిన విషాదకర ఘటన ఒడిశాలోని బలాంగీర్ జిల్లా టిట్లాగఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ ఘాట్ గ్రామానికి చెందిన లబ్ హర్పాల్ కుమారుడు సోమవారం సాయంత్రం ట్యూషన్ నుంచి తిరిగి వస్తూ దారిలో ఓ షాపులో చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్ తిందామని వంటగదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతని తల్లి భానుమతి హర్పాల్ గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తోంది. ఆమె నీళ్ల కోసం బయటకు వెళ్లిన ఆ కొద్ది క్షణాల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది.

బాంబులా పేలిన చిప్స్ ప్యాకెట్
బాలుడి చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ప్రమాదవశాత్తు జారి మండుతున్న గ్యాస్ స్టవ్‌పై పడింది. వేడి తగలగానే ఆ ప్యాకెట్ ఒక్కసారిగా బాంబులా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రత నేరుగా బాలుడి ముఖంపై పడటంతో అతని కన్ను తీవ్రంగా దెబ్బతిని రక్తమోడింది. బాలుడి అరుపులు విని తల్లి పరుగెత్తుకుంటూ వచ్చేసరికి చిన్నారి రక్తపు మడుగులో కనిపించాడు.
ओडिशा के बलांगीर में चिप्स का पैकेट बना ‘बम’ — गैस चूल्हे के पास पहुंचते ही हुआ जोरदार धमाका, 8 साल के मासूम की एक आंख हमेशा के लिए खराब। पुलिस कर रही है प्रोडक्ट और ब्लास्ट की जांच।#Odisha #Balangir #BreakingNews #ChildInjured #ChipsPacketBlast pic.twitter.com/JIGuGhESEv
— Nandini Laxakar (@LaxakarNandini) January 13, 2026
కంటిచూపు శాశ్వతంగా కోల్పోయిన బాలుడు
కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కంటికి తగిలిన గాయం చాలా లోతుగా ఉందని, ఆ కన్ను పూర్తిగా దెబ్బతిందని నిర్ధారించారు. ఆ కంటికి చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. "నేను బిస్కెట్లు తెచ్చుకోమని డబ్బులిస్తే వాడు చిప్స్ ప్యాకెట్ తెచ్చాడు.. ఇంత చిన్న వయసులో వాడికి ఇలా జరుగుతుందని ఊహించలేదు" అని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
కంపెనీపై కేసు నమోదు
పిల్లలు తినే పదార్థాల ప్యాకెట్లు ఇంత ప్రమాదకరంగా ఎలా ఉంటాయని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిప్స్ తయారు చేసిన కంపెనీపై టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్యాకెట్‌లో నింపిన గ్యాస్ నాణ్యత, అది పేలడానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా విచారిస్తామని పోలీసులు తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications