వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగరేట్ బట్స్‌తోపాటు 12 ప్లాస్టిక్ ఐటమ్స్‌పై ప్రాథమికంగా నిషేధం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్లాస్టిక్ బాటిల్స్(బేవరేజెస్), డెకోరేషన్ థర్మకోల్(పాలీస్టైరెన్), సిగరెట్ బట్స్ తోపాటు 12 ప్లాస్టిక్ వస్తువులపై ప్రాథమికంగా నిషేధం విధించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కేంద్రం యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని, అయితే, ఇది దశలవారీగా జరుగుతుందని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా ఇప్పటికే నిషేధించాల్సిన ప్లాస్టిక్ వస్తువుల జాబితాను రూపొందించడం జరిగిందని చెప్పారు.

 Cigarette Butts Among 12 Plastic Items That Could Be Banned By Centre

Recommended Video

20 సెకండ్లలో సిగరెట్ తో రాకెట్స్ ని వెలిగించిన పెద్దాయన

క్యారీ బ్యాగ్స్(50మైక్రాన్స్ కంటే తక్కువ), నాన్-వోవెన్ క్యారీ బ్యాగ్స్, ప్లేట్లు, ల్యామిననేటెడ్ బాణాలు, ప్లేట్లు, చిన్న ప్లాస్టిక్ కప్పులు, కంటెయినర్స్(150ఎంఎల్, 5గ్రాముల కన్నా తక్కువ), ఇయర్ బడ్స్‌కి ఉపయోగించే ప్లాస్టిక్ పుల్లలు, బెలూన్లు, జెండాలు, క్యాండీస్, సిగరెట్ బట్స్, పాలీస్టైరెన్, బేవరేజెస్‌కు ఉపయోగించే చిన్న ప్లాస్టిక్(200ఎంఎల్ కన్నా తక్కువ), రోడ్లపై పెట్టే బ్యానర్లు(100 మైక్రాన్స్) లాంటి వాటిపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దేశ వ్యాప్తంగా పూర్తిగా లేకుండా చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళిక వేస్తోంది. 2022 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాగా, ఈ ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయాలను చెప్పాలని ప్లాస్టిక్ ఇండస్ట్రీలను కోరింది. పెట్ ప్లాస్టిక్ బాటిల్ ఇండస్ట్రీ ఒక్కటే రూ. 7.5లక్ష కోట్ల టర్నోవర్ చేస్తోందని సమాచారం.

English summary
The central government, which has waged a war on single-use plastic, is planning to impose an initial ban on 12 items, including small plastic bottles used for beverages, thermocol (polystyrene) used for decoration and cigarette butts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X