16ఏళ్ల బాలికపై కన్నేశారు.. నాలుగు రోజుల పాటు గ్యాంగ్ రేప్

Subscribe to Oneindia Telugu

ముంబై : ఓ పదో తరగతి బాలిక ఏదో పనిమీద బయటకు వెళ్లి.. తిరిగి ఇంటికెళతున్న సమయంలో ఇద్దరు యువకులు ఆమెను అపహరించారు. అనంతరం ఓ హోటల్ గదిలో ఆమెను నాలుగు రోజుల పాటు బంధించి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల నుంచి తప్పించుకున్న బాలిక.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు బాధితురాలినే ఎదురు ప్రశ్నలతో వేధించారు. ఆఖరికి ఓ స్వచ్చంద సంస్థ ఎంట్రీతో కేసుపై ఫోకస్ చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Class 10th Girl gand raped in mumbai

వివరాల్లోకి వెళితే.. పదో తరగతి చదువుతోన్న 16 ఏళ్ల బాలిక ముంబైలోని నలసోపర రైల్వే స్టేషను నుంచి ఇంటికి వెళుతుండగా, మార్గ మధ్యలో ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి నగరంలోని ఓ లాడ్జీలో బంధించారు. అనంతరం స్నేహితులతో కలిసి నాలుగు రోజుల పాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అంతేకాదు, విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలికను హెచ్చరించారు. అయితే నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రలకు చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కాస్త ఎదురు ప్రశ్నలతో వేధించడంతో.. జవహర్ నగర్ సమాజ్ సేవక్ సంస్థ సభ్యులు జోక్యం చేసుకుని బాలికకు సహాయం అందించాల్సిందిగా పోలీసులను కోరారు.

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు దీపక్ మిశ్రాను అరెస్టు చేయగా, మిగతా వారికోసం గాలిస్తున్నట్లుగా సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 10th class Girl was gang raped by some unknown people in mumbai. Case was registered by mumbai police and they arrested the alleged person deepak mishra

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి