Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పకూలిపోతున్న బంగారం ధరలు-

దేశంలో నేడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. బలహీనమైన డాలర్, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్.. దీనికి ప్రధాన కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర 0.05 శాతం తగ్గింది. ఎంసీఎక్స్ బంగారం ధర 1,60,356 రూపాయలకు చేరింది. వెండిది కూడా ఇదే పరిస్థితి. కిలో వెండి 0.31 శాతం తగ్గి 2,68,802 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబై బులియన్ ఓపెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,240కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,47,800కు లభించింది. వివిధ నగరాల్లో వేర్వేరుగా బంగారం ధరలు నమోదయ్యాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,62,360 ధర పలకగా, 22 క్యారెట్లు రూ. 1,48,840గా నమోదైంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,61,240, 22 క్యారెట్లు రూ. 1,47,800 వద్ద లభించింది.

Gold Price down in India on March 13 as Dollar Weakens Mumbai Gold Hits Rs 161240 per 10 gram

అంతర్జాతీయంగా యూఎస్ స్పాట్ గోల్డ్ 0.8 శాతం పెరిగి, ఔన్సుకు 5,118.75 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 5,123.30 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలర్ విలువ తగ్గడంతో ఇతర కరెన్సీల వారికి బంగారం కొనుగోలు చౌకగా మారింది. ఈ పరిణామాల మధ్య ఈ వారం బంగారం సుమారు ఒక శాతం మేర నష్టపోయింది. ద్రవ్యోల్బణం భయాలు, అధిక చమురు ధరలు కొనసాగితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యంపై సందేహాలు బంగారం ఆకర్షణను కొంతవరకు దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,256, 22 క్యారెట్లు - రూ. 14,900, 18 క్యారెట్లు - రూ. 12,550

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,093

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,093

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,093

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,093

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,124, 22 క్యారెట్లు- రూ. 14,780, 18 క్యారెట్లు - రూ. 12,093

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+