గర్ల్ ప్రెండ్ ఫోన్ నెంబర్ అడిగాడని ప్రాణస్నేహితుడిని ఏం చేశాడంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ :ఫోన్ నెంబర్ ప్రాణ స్నేహితుడి ప్రాణం తీసింది. తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ను అడిగినందుకు ప్రాణ స్నేహితుడని చూడకుండా కత్లితో పొడిచి చంపాడు ఓ లవర్. ఈ ఘటన న్యూడిల్లీలో చోటుచేసుకొంది.

డిల్లీలోని నిహల్ విహర్ ప్రాంతానికి చెందిన షంషాద్ సలావుద్దీన్ ప్రాణ స్నేహితులు. గర్ల్ ఫ్రెండ్ వీరిద్దరి స్నేహన్ని దెబ్బతీసింది. ఆఖరుకు ప్రాణాలు తీసేవరకు వెళ్ళింది. గత ఏడాది వీరిద్దరూ ముబారక్ పూర్ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో షంషాద్ కు ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది.

ప్రాణ స్నేహితులు ఒకరి ఫోన్లు మరోకరు తీసుకొంటారు. అయితే షంషాద్ ఫోన్ లో ఉన్న ఆ అమ్మాయి నెంబర్ ను తీసుకొని సలావుద్దీన్ తరుచూ ఫోన్ చేసేవాడు. అంతేకాదు ఆమెను వేధించేవాడు. అయితే గర్ల్ ఫ్రెండ్ షంషాద్ కు విషయాన్ని వివరించింది. దీంతో ఆయన సెల్ ఫోన్ మార్చాలని సలహా ఇచ్చాడు అంతే కాదు కొత్త సిమ్ కార్డును కొనిచ్చాడు.

close friends turn into enemy, harrasement friends girl friend

కొత్త ఫోన్ నెంబర్ కోసం సలావుద్దీన్ ప్రయత్నించాడు సాధ్యం కాలేదు. నవంబర్ 25వ, తేదిన స్నేహితులంతా డిల్లీలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ వేడుకలోనే షంషాద్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కావాలని సలావుద్దీన్ అడిగాడు.దీంతో షంషాద్ సలావుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సలావుద్దీన్ తన గర్ల్ ఫ్రెండ్ ను వేధిస్తాడని భావించిన షంషాద్ సలావుద్దీన్ హత్య చేయాలని భావించాడు. కత్తికొని తన స్రేహితులు పాల్, మోనూలతో సహా షంసాద్, సలావుద్దీన్ కూడ పార్క్ కు వచ్చారు. పార్క్ లోనే సలావుద్దీన్ ను తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతున్నావని ప్రశ్నిస్తూనే కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
shamshad, salavuddin close friends, they are from delhi. last year salavuddin, shamshad went to mubharak pur village , shashad fell love a girl in the village.salavuddin take her phone number from shamshad phone, and harassment her. that girl informed to shamshad,shamshad changed phone number, salavuddin asked shamshad her girl friend phone number. shamshad stabbed with knife salavuddin. salavuddin spotdead.
Please Wait while comments are loading...