సిద్దూ, డీకే ఫ్యాన్స్ కు లాఠీ దెబ్బలు, సమయం లేదు మిత్రమా అంటూ ఎంట్రీతో !

బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఈరోజు మద్యాహ్నం 12. 30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాటు జరిగాయి. బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని వివిద ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంఠీరవ స్టేడియంకు బయలుదేరారు.

సిద్దరామయ్య సొంత నియోజక వర్గం అయిన వరుణా నుంచి 10 వేల మందికి పైగా సిద్దూ అభిమానులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఇక మాస్ లీడర్, కేపీసీసీ అధ్యక్షడు డీకే శివకుమార్ సొంత నియోజక వర్గం అయిన కనకపుర నుంచి వేలాది మంది బెంగళూరు చేరుకున్నారు. మద్యాహ్నం ప్రమాణస్వీకారం జరుగుతుంటే ఉదయం నుంచి కంఠీరవ స్టేడియంలోకి వేలాది మంది లోపలికి వెళ్లడానికి పోటీపడ్డారు.

CM: Bengaluru police lathi-charged Siddaramaiah fans at Kanthirava Stadium.

కంఠీరవస్టేడియం గేట్ నెంబర్ 3లో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీపడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోపులాటకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పిచెప్పి విసిగిపోయిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసులు లాఠీచార్జ్ లో పలువురుకు గాయాలు కావడంతో చాలా మంది కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు పరుగు తీశారు. ఆలస్యం అయితే కంఠీరవ స్టేడియంలోకి వెళ్లడానికి అకాశం ఉండదని భయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం 8 గంటల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు.

CM: Bengaluru police lathi-charged Siddaramaiah fans at Kanthirava Stadium.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సుమారు 1 లక్ష మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరౌతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సుమారు 50 వేల మంది సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి హాజరౌతారని నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+