మహిళల అకౌంట్‌లో ఏటా రూ.15,000: మరో కొత్త పథకం

న్యూ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు తీవ్రతరమౌతోంది. ఇప్పటికే ఇక్కడ తొలి విడత పోలింగ్ ముగిసింది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్‌ను నిర్వహించారు అధికారులు.

ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతతో పాటే మిజోరంలోనూ పోలింగ్ పూర్తయింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. అదే రోజున మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. అధికారంలోకి వచ్చేదెవరనేది తేలిది అప్పుడే.

CM Bhupesh Baghel announced Chhattisgarh Griha Lakshmi Yojana

ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సారథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. భారతీయ జనతా పార్టీని మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది.

పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాందీ, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రచార బాధ్యతలను స్వీకరించారు. అదే సమయంలో- ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తోన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరో సరికొత్త పథకాన్ని ప్రకటించారు. దీపావళి పండగ (Diwali 2023) ను పురస్కరించుకుని ఆయన ఈ పథకాన్ని వెల్లడించారు.

CM Bhupesh Baghel announced Chhattisgarh Griha Lakshmi Yojana

తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మీ యోజన (Chhattisgarh Griha Lakshmi Yojana) ను అమలు చేస్తామని అన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం మహిళల ఖాతాలో 15,000 రూపాయలను జమ చేస్తామని తెలిపారు.

దీపావళి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్ మహతారి ఆశీస్సులతో, రాష్ట్రంలో మహిళా శక్తి కోసం కీలక నిర్ణయం తీసుకున్నానని వివరించారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల కోసం ఛత్తీస్‌గఢ్ గృహ లక్ష్మి యోజనను అమలు చేస్తామని, దీని కింద వారి ఖాతాల్లోకి నేరుగా సంవత్సరానికి 15,000 రూపాయలను జమ చేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+