నేను విజిల్ ఏస్తే ఢిల్లీ సోడా బుడ్డి, హోటల్ లో హ్యాపీగా విజిల్ వేస్తున్న సిద్దరామయ్య!
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు ? అని అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, అన్ని పార్టీల కార్యకర్తలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. సీఎం రేసులో తనకు డీకే శివకుమార్ గట్టి పోటీ ఇస్తున్నారని తెలిసినా మాజీ సీఎం సిద్దరామయ్య హోటల్ లో హ్యాపీగా విజిల్ వేసుకుంటూ తిరగడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇంత టెన్షన్ లో కూడా సిద్దరామయ్య సీఎం కుర్చి ఏమౌతుందో అని ఆలోచించకుండా హ్యాపీగా విజిల్ వేసుకుని హోటల్ లో అలాఇలా తిరుగుతూ ఉండటంలో ఢిల్లీలోని మీడియా సైతం షాక్ అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో పోటీ పడుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య సోమవారం మద్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.

సీఎం సీటు సంపాధించాలని సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లిన చాలా కూల్ గా డీకే శివకుమార్ సోమవారం మొత్తం బెంగళూరులోనే ఉండిపోయారు. ఢిల్లీ వెళ్లిన సిద్దరామయ్య ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. రాత్రి ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో సిద్దరామయ్య, ఆయన వెంట ఢిల్లీ వెళ్లిన కొందరు ఎమ్మెల్యేలు, సన్నిహితులు బస చేశారు.
మంగళవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకోవడంతో అందరికి టెన్షన్ మొదలైయ్యింది. సీఎం సీటు కోసం పోటీ పడుతున్న సిద్దరామయ్య, డీకే శికుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే ఉండటంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Whistler #Siddaramaiah! pic.twitter.com/rGf2K9jq5L
— Imran Khan (@KeypadGuerilla) May 15, 2023
సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్దరామయ్య ఢిల్లీలోని ఓ హోటల్ లో విజిల్ వేసుకుంటూ హ్యాపీగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన మీడియా మిత్రులు సిద్దరామయ్య హ్యాపీగా విజల్ వేస్తున్న విషయం గుర్తించి షాక్ అయ్యారు. తరువాత సార్ మీరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని కలుస్తారా అంటూ మీడియా పదేపదే సిద్దరామయ్యను అడిగింది.
ఆ సమయంలో సిద్దరామయ్యకు చిర్రెత్తి లేదు నిన్ను కలుస్లాను అంటూ చెప్పడంతో అక్కడ ఉన్న మీడియా మిత్రులు హడలిపోయారు. ఓ పక్క డీకే శివకుమార్ ఢిల్లీ వచ్చేశాడని టెన్షన్ పడకుండా సిద్దరామయ్య హ్యీపీగా విజిల్ వేసుకుంటూ హోటల్ లో ఎంజాయ్ చేస్తూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications