ఇద్దరు మంత్రులు అవుట్? కేబినెట్‌ ప్రక్షాళన దిశగా విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడంతో పాటు పాలనా వేగాన్ని పెంచేందుకు వీలుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సీఎం విజయ్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి గరిష్టంగా 35 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం కేబినెట్‌లో అన్ని స్థానాలూ భర్తీ అయి ఉండటంతో.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటే కొందరిపై వేటు వేయడం తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా అన్నాడీఎంకే (AIADMK) నుంచి టీవీకేలో చేరిన సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పించడం కోసమే సీఎం విజయ్ ఈ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు వివాదాస్పద మంత్రులను కేబినెట్ నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

CM Vijay Cabinet Reshuffle Two Controversial Ministers Facing Exit To Accommodate AIADMK Seniors Now

ఆ ఇద్దరిపై వేటు పడటానికి కారణాలు ఇవే!

ప్రస్తుత సమాచారం ప్రకారం.. తాంబరం ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి శరత్ కుమార్, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్వరిలకు మంత్రి పదవులు ఊడటం దాదాపు ఖాయమైంది.

శరత్ కుమార్ వివాదం:

ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా మంత్రి శరత్ కుమార్ వివాదాస్పద రీతిలో కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇది ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది.

మంత్రి జగదీశ్వరి వివాదాలు:

ప్రముఖ రౌడీషీటర్ రాకెట్ రాజాతో మంత్రి జగదీశ్వరి దిగిన కొన్ని పాత ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. దీనికి తోడు తోటి మంత్రి కీర్తనతో ఆమెకు ఉన్న తీవ్ర విభేదాలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ సాగనంపడమే శ్రేయస్కరమని సీఎం విజయ్ భావిస్తున్నట్లు సమాచారం.

జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవే..!
జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.. చర్చించే అంశాలు ఇవే..!

సీనియర్లకు పట్టం.. మిత్రపక్షాల డిమాండ్లు!

తప్పించబోయే ఇద్దరి స్థానాల్లో అన్నాడీఎంకే నుంచి వచ్చిన సీ.విజయభాస్కర్ వంటి సీనియర్లను రాబోయే ఉప ఎన్నికల్లో గెలిపించి మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. మరోవైపు, మిత్రపక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. టీవీకే మిత్రపక్షమైన వీసీకే (VCK) నేత వన్నియరసు శాఖను మార్చాలని, తమకు మరింత ప్రాధాన్యత ఉన్న కీలక శాఖను కేటాయించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఐయూఎంఎల్ (IUML) మంత్రి షాజహాన్ పోర్ట్‌ఫోలియోపై కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Cabinet Reshuffle: కేబినెట్ విస్తరణపై మోడీ తాజా ట్విస్ట్- మారిపోయిన లెక్కలు..!
Cabinet Reshuffle: కేబినెట్ విస్తరణపై మోడీ తాజా ట్విస్ట్- మారిపోయిన లెక్కలు..!

ఉప ఎన్నికల తర్వాతే అధికారిక నిర్ణయం!

అయితే ఈ మంత్రివర్గ ప్రక్షాళన తక్షణమే జరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో వివిధ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాతే, సమీకరణాలను బట్టి సీఎం విజయ్ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తారని టీవీకే సీనియర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+