తమిళనాట ఉపఎన్నికల టెన్షన్ ? - విపక్షాల షాక్ తో హైకోర్టుపైనే విజయ్ ఆశలు..!
తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు చోట్ల గెలిచిన సీఎం విజయ్ (CM Vijay).. ఆ తర్వాత తిరుచ్చి ఈస్ట్ స్టానానికి రాజీనామా చేశారు. దీంతో పాటు పెరుందురై, అంబసముద్రం, విరాలిమలై, కరూర్ సీట్లకూ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణంగా అయితే ఆయా చోట్ల ఖాళీల్ని ఎన్నికల సంఘం నోటిపై చేయడం, ఆ తర్వాత ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఐదు సీట్లలో ఉపఎన్నికలు జరిగితే విజయ్ పార్టీ టీవీకే దక్కించుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ ఐదు సీట్లలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేశారు. దీంతో ఆయా చోట్ల ఉపఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. కానీ అక్కడే విపక్ష డీఎంకే చక్రం తిప్పింది. ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్ధులతో హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు వేయించింది. దీంతో హైకోర్టు కూడా ఆయా సీట్లలో తమ విచారణ పూర్తయ్యే వరకూ ఎన్నికలు నిర్వహించవద్దని ఈసీకి తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ పెండింగ్ లో ఉండగా తాము ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం చేతులెత్తేసింది. ఇదంతా చివరికి విజయ్ కు చికాకుగా మారింది.

తిరుచ్చి ఈస్ట్, పెరుందురై, అంబసముద్రం, విరాలిమలై, కరూర్ సీట్లలో ఉప ఎన్నికలు జరిగితే వాటిని కచ్చితంగా టీవీకే గెల్చుకునే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల పిటిషన్లతో ఈ ఉప ఎన్నికల్ని ఆలస్యం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు విజయ్ సర్కార్.. ఉపఎన్నికల ఆలస్యం వల్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేక అభివృద్ది కుంటుపడుతుందని హైకోర్టులో వాదిస్తోంది. తాజాగా జరిగిన వాదనల్లోనూ విజయ్.. ఉప ఎన్నికలు నిర్వహించకుండా ఈ ఐదు చోట్ల లక్షలాది మంది ప్రజల్ని ఇబ్బందిపెడతారా అని హైకోర్టును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న హైకోర్టు తీసుకునే నిర్ణయం విజయ్ పార్టీ టీవీకేకు కీలకంగా మారింది. హైకోర్టులో ఈ వ్యవహారం తేలకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు విజయ్ సిద్దమవుతున్నారు.














Click it and Unblock the Notifications