హెచ్ 1బీ, ఇతర వీసాలపై బిగ్ షాకివ్వనున్న ట్రంప్: అన్ని దారులూ మూసుకుపోతాయ్

అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుగనే భారతీయ ఐటీ నిపుణులు, టెక్కీలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. కొత్త హెచ్-1బీ వీసాల ఫీజును భారీగా పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ వీసా ఫీజు లక్ష డాలర్లు ఉంటోంది. దీన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకున్నారు. నూతన ఫీజు మొత్తాన్ని కూడా ఖరారు చేశారు. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా ప్రతిపాదనలను రూపొందించింది.

ఇకపై H1B వీసా ఫీజు 1,03,265 డాలర్లుగా ఉండబోతోంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు 86.80 లక్షల రూపాయలు. ఈ ఫీజు మొత్తాన్ని శాశ్వత ప్రాతిపదికన పెంచాలని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ను వైట్ హౌస్ కు అందజేసింది. ఈ నిర్ణయం.. అమెరికా కంపెనీల నియామక ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా భారతీయ టెక్కీల అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది.

Trump Proposal Clears White House Review to End H 1B and Other Visa 60-Day Job Search Grace Period

ఇది అక్కడితే ఆగట్లేదు. ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసా హోల్డర్లకు ఇప్పటివరకు వెసలుబాటుగా ఉంటూ వస్తోన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేయాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. వీటిని రేపో మాపో వైట్ హౌస్ కు పంపింది. దీనిపై వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ రివ్యూ చేసింది. దీన్ని అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది.

దీంతో ఈ గ్రేస్ పీరియడ్ ఎత్తివేత ముసాయిదాను అధికారిక గెజిట్‌లో ప్రచురించడానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కు లైన్ క్లియర్ అయింది. గెజిట్ లో ప్రచురించిన అనంతరం దీనిపై ప్రజాభిప్రాయాన్ని, అభ్యంతరాలను సేకరిస్తుందా విభాగం. నిజానికి.. ఈ గ్రేస్ పీరియడ్ విధానాన్ని 2017లో అప్పటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది.

అమెరికా చట్టాల ప్రకారం ప్రస్తుతం.. ఏదైనా సంస్థ విదేశీ ఉద్యోగులను తొలగిస్తే.. వారు అక్కడే ఉంటూ మరో ఉద్యోగాన్ని వెదుక్కోవడానికి లేదా ప్రత్యామ్నాయ వీసా మార్గాలను అన్వేషించుకోవడానికి రెండు నెలలు.. అంటే 60 రోజుల సమయం లభిస్తుంది. దీన్ని గ్రేస్ పీరియడ్ గా పిలుస్తారు. ఈ రెండు నెలల వ్యవధిలో వాళ్లకు వేరే ఉద్యోగం లభిస్తే అమెరికాలోనే చట్టబద్ధంగా వీసా కేటగిరీని మార్చుకొని అక్కడే ఉండొచ్చు.

ఈ గ్రేస్ పీరియడ్ ను కూడా రద్దు చేయాలని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ తాజా ప్రతిపాదనల్లో పొందుపరిచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రతిపాదన తుది రూపాన్ని సంతరించుకుంటే, అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ హెచ్1బీ వీసా హోల్డర్లు ఇబ్బందులు పడకతప్పదు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికాను వీడాల్సి వస్తుంది. ఒకవేళ ఇమ్మిగ్రేషన్ విభాగం తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ వ్యక్తిగతంగా మినహాయింపు ఇస్తే తప్ప.. అమెరికాలో నివసించడానికి ఉన్న అన్ని మార్గాలూ మూసుకుపోయినట్టవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+