కాగ్నిజెంట్ షాక్: నామ మాత్రంగా వేతనాల పెంపు, సీఈఓకు 3 శాతమే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కంపెనీలో పనిచేసే కీలక ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలను నామ మాత్రంగానే పెంచింది. కేవలం సింగిల్ డిజిట్‌‌లోనే వేతనాల పెంచుతూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకొంది. మరో వైపు కాగ్నిజెంట్ సీఈఓ కేవలం 3 శాతం మాత్రమే వేతనాల పెంపు దక్కింది.

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలను పెంచింది. అయితే టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు నామ మాత్రంగానే వేతనాలు పెంచింది. మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా కాగ్నిజెంట్ వేతనాలను పెంచిందని ప్రకటించింది.

Cognizant offers single-digit pay hike to key executives, CEO gets 3 per cent

సింగిల్ డిజిట్‌లో మాత్రమే వేతనాలు పెంపులుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో డి సౌజాతో పాటు మిగిలిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లైన అధ్యక్షుడు రాజీవ్ మెహతా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కరేన్ మెక్లౌగ్లిన్ వేతనాలను 2017లో కేవలం 3 శాతం నుండి 8 శాతం మధ్యలోనే పెంచారు. ఈ మేరకు నివేదికలో వెల్లడైంది.

వేతనాల పెంపు విషయంలో మార్కెట్ ట్రెండ్‌లను పరిగణనలోకి తీసుకొన్నట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యక్ష పరిహరాల్లో డి.సౌజా పరిహారాలు మొత్తంగా 3 శాతం మేరకే పెరిగాయి. 2017లో ఈయన పరిహారాలు 12.23 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్‌ యూనిట్లు, నియంత్రిత స్టాక్‌ యూనిట్లు 3 శాతం మాత్రమే పెరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2016 సెప్టెంబర్‌లో కాగ్నిజెంట్ అధ్యక్ష బాధ్యతలను మోహతా చేపట్టారు. ప్రమోషన్‌పై ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ప్రమోషన్ పొందిన సమయంలో ఆయనకు 14 శాతం వేతనాలను పెంపు అందుకొన్నాడు. అయితే 2017 నాటికి పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకొంది. ప్రత్యక్ష పరిహరాల్లో కేవలం 3 శాతం మాత్రం పెంపును మాత్రమే ఆయన దక్కించుకొన్నాడు.

వార్షిక పనితీరు ఆధారంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 2016 నుండి లెక్కలు తీస్తే కేవలం 3 నుండి 4 శాతం మాత్రమే పెరిగాయి. మరో కీలక ఎగ్జిక్యూటివ్‌ మెక్లౌగ్లిన్ కూడ నామ మాత్రంగానే వేతనాల పెంపు దక్కింది.

2017లో మెక్లౌగ్లిన్ ‌కు కేవలం 8 శాతం మాత్రమే వేతనాలు పెరిగాయి. అయితే 2016లో మాత్రం ఆమెకు ఎక్కువ మొత్తంలో వేతనాలను పెంపు దక్కింది.2016లో వేతనం, వార్షిక నగదు ప్రోత్సాహకాల్లో 17 శాతం పెరుగుదల ఉంది. కానీ, 2017 నాటికి ఇది కాస్తా 8 శాతానికి పడిపోయింది.

ఆమె పీఎస్‌యూ 5 శాతం, ఆర్ఎస్‌యూ గ్రాంట్లు 6 శాతం చొప్పున ఉణ్నాయి. 2016, 2017 సంవత్సరాల్లో ఎగ్జిక్యూటివ్‌ల వార్షిక పనితీరు ఆధారంగా పరిహారాలను పెంచినట్టుగా కంపెనీ ప్రకటించింది. పరిశ్రమ అంచనాలు, కంపెనీ లక్ష్యాలు, ఎగ్జిక్యూటివ్‌ల పనితీరు, బాధ్యత ఎగ్జిక్యూటివ్‌ల టాలెంట్ మార్కెట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT services major Cognizant offered single-digit hike in compensation to its key executives including chief executive officer Francisco D’Souza in 2017 considering the market trends.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి