కాగ్నిజెంట్ రిపోర్ట్ షాక్: భారతీయ ఉద్యోగుల భారీ కోత
ఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో గత సంవత్సరం భారీగా ఉద్యోగాల కోత విధించినట్లు ఆ కంపెనీ వార్షిక ఫైలింగ్ ద్వారా యూఎస్ సెక్యురిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు భారత్‌లోనే అత్యధికంగా జరగడం గమనార్హం.

భారత్ వాటా అధికమే
ఈ నివేదిక ప్రకారం అమెరికా, యూరప్‌లోని కాగ్నిజెంట్‌లో ఉద్యోగాల సంఖ్య కొద్దిగా పెరిగినప్పటికీ.. భారత్‌లో మాత్రం ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా ఉంది. 2017 నివేదిక ప్రకారం మొత్తం కాగ్నిజెంట్‌లో 2.60లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో భారత్‌లో సుమారు 1.8లక్షల మంది ఉన్నారు.

తొలగింపు భారీగానే..
కానీ అంతక్రితం ఏడాది 2016లో కంపెనీలో 2,60,200 మంది పనిచేస్తుండగా.. వారిలో భారత్‌లో పనిచేస్తున్న వారి సంఖ్య 1.88లక్షలుగా ఉంది. అంటే దీని ప్రకారం గతేడాది కాగ్నిజెంట్ దాదాపు 8వేల మంది ఉద్యోగులను తొలగించింది.

అదే కారణం
భారత ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు ఆటోమేషనే కారణమని తెలుస్తోంది. దీంతో పాటు సరికొత్త నైపుణ్యాలు, ఆలోచనలు కలిగిన వారికే ఐటీ కంపెనీలు ఎక్కువగా అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపుతుండటం ఇతర కారణాలుగా తెలుస్తున్నాయి.

ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశం
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం నాటికి ఐటీ రంగంలో అదనంగా మరో 10లక్షల మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, ఐటీ రంగంలో వృత్తి నైపుణ్యం కలవారికే ఈ అవకాశాలని తెలుస్తోంది.
-
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
నెలకు రూ.69,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications