College girl: ఒక్క ఫోన్ కాల్ కాలేజ్ అమ్మాయి ప్రాణం తీసింది, బాత్ రూమ్ లో ఆ వీడియో మా దగ్గర ఉందని !

చెన్నై/కోయంబత్తూరు: కాలేజ్ కు వెలుతున్న మా అమ్మాయి బాగా చదువుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అమ్మాయి ఎంత వరకు చదివితే అంత వరకు చదివించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. సొంత ఊరి నుంచి కాలేజ్ కి చాలా దూరం ఉండటంతో ఆమె బంధువుల ఇంట్లో ఉంటూ ఎంఎస్సీ చదువుతోంది. ప్రతిరోజూ కాలేజ్ కు వెళ్లి వస్తోంది. కొన్ని రోజుల క్రితం కాలేజ్ అమ్మాయి ఆమె సొంత ఊరికి వెళ్లింది. కొన్ని రోజులుగా దిగులుగా ఉంటున్న కూతురిని ఏం జరిగింది ? అంటూ తల్లి ప్రశ్నించింది. ఏమీ జరగలేదని, కాలేజ్ చదువు కొంచెం ఒత్తిడిగా ఉందని రెండు మూడు రోజులు తల్లికి చెబుతూ వచ్చింది.

రాత్రి తల్లిదండ్రులతో పాటు కూతురు భోజనం చేసింది. తల్లిదండ్రులు ఒక గదిలో, కూతురు మరోగదిలోకి వెళ్లి నిద్రపోయారు. ఉదయం ఇంట్లో కూతురు కనపడకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఇంటి వెనుక ఉన్న మరోగదిలో కాలేజ్ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు హడలిపోయారు. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి ఇంట్లోని టీవీ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది. డెత్ నోట్ లోని వివరాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు.

 కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని చిందబరం సమీపంలోని దక్షిణ పిచ్చవరంలో క్రిష్ణన్ అనే ఆయన నివాసం ఉంటున్నాడు. క్రిష్ణన్ కు 22 వయసు ఉన్న కుమార్తె ఉంది. ముట్టూరులోని కాలేజ్ లో క్రిష్ణన్ కూతురు ఎంఎస్సీ చదువుతోంది. కాలేజ్ కు వెలుతున్న మా అమ్మాయి బాగా చదువుకోవాలని ఆమె తండ్రి క్రిష్ణన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు.

 బంధువుల ఇంట్లో ఉంటున్న యువతి

బంధువుల ఇంట్లో ఉంటున్న యువతి

అమ్మాయి ఎంత వరకు చదివితే అంత వరకు చదివించాలని ఆమె తండ్రి క్రిష్ణన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు. సొంత ఊరి నుంచి కాలేజ్ కి చాలా దూరం ఉండటంతో ఆమె వండియంపాళ్యంలోని దగ్గర బంధువుల ఇంట్లో ఉంటూ ఎంఎస్సీ చదువుతోంది. ఆ యువతి ప్రతిరోజూ కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

 ఇంటికి వెళ్లి దిగులుగా ఉన్న కాలేజ్ అమ్మాయి

ఇంటికి వెళ్లి దిగులుగా ఉన్న కాలేజ్ అమ్మాయి

కొన్ని రోజుల క్రితం కాలేజ్ అమ్మాయి ఆమె సొంత ఊరు దక్షిణ పిచ్చవరంకు వెళ్లింది. కొన్ని రోజులుగా దిగులుగా ఉంటున్న కూతురిని ఏం జరిగింది ? అంటూ ఆమె తల్లి ప్రశ్నించింది. ఏమీ జరగలేదని, కాలేజ్ చదువు కొంచెం ఒత్తిడిగా ఉందని రెండు మూడు రోజులు తల్లికి చెబుతూ వచ్చింది. రాత్రి తల్లిదండ్రులతో పాటు కూతురు భోజనం చేసింది. తల్లిదండ్రులు ఒక గదిలో, కూతురు మరోగదిలోకి వెళ్లి నిద్రపోయారు.

 ఇంటి వెనుక శవమైన కూతురు

ఇంటి వెనుక శవమైన కూతురు

మరుసటి రోజు ఉదయం ఇంట్లో కూతురు కనపడకపోవడంతో ఆమె కోసం తండ్రి క్రిష్ణన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాలించారు. ఇంటి వెనుక ఉన్న మరోగదిలో కాలేజ్ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు హడలిపోయారు. కాలేజ్ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి ఇంట్లోని టీవీ పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది.

 బాత్ రూమ్ లో స్నానం చేసే వీడియో ఉందని బ్లాక్ మెయిల్

బాత్ రూమ్ లో స్నానం చేసే వీడియో ఉందని బ్లాక్ మెయిల్

డెత్ నోట్ లోని వివరాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. తాను బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీశారని, తన కోరికలు తీర్చకపోతే నీ బాత్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని పదేపదే ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని, పరువు పోతుందని నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని కాలేజ్ అమ్మాయి డెత్ నోట్ లో రాసి పెట్టిందని పోలీసులు అన్నారు.

 కాలేజ్ అమ్మాయి మొబైల్ ఫోన్ లో ?

కాలేజ్ అమ్మాయి మొబైల్ ఫోన్ లో ?

మా కూతురు ఆత్మహత్యకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని క్రిష్ణన్, ఆయన భార్య పోలీసులకు మనవి చేశారు. కాలేజ్ అమ్మాయి డెత్ నోట్ తో పాటు ఆమె మొబైల్ ఫోన్ కూడా టేబుల్ మీద పెట్లిందని, ఆమె మొబైల్ ఫోన్ ఆధారంగా ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+