లేడీ లెక్చరర్ తో రొమాన్స్ చెయ్యలని ప్రయత్నించిన కాలేజ్ ప్రిన్సిపాల్, క్లైమాక్స్ లో !
బెంగళూరు/బళ్లారి: కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళతో రొమాన్స్ చెయ్యాలని ప్రయత్నించిన ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చెయ్యడం కలకలం రేపింది. 60 ఏళ్ల దగ్గర పడుతున్న కాలేజ్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులను కొన్ని నెలలుగా బరిస్తున్న లేడీ లెక్చరర్ చివరికి విసిగిపోయి విశ్వవిద్యాలయంలోని పెద్దలకు, పోలీసులకు అసలు మ్యాటర్ చెప్పడంతో కామాంధుడైన కాలేజ్ ప్రిన్సిపాల్ అసలు భాగోతం బయటకు వచ్చింది.
కాలేజ్ లెక్చరర్‌ను లైంగికంగా వేధించిన కేసులో బళ్లారిలోని అల్లం సుమంగళమ్మ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ శరణప్ప(59) గత 6 నెలలుగా లేడీ లెక్చరర్ ను వేధిస్తున్నాడని వెలుగు చూడటంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. విశ్వవిధ్యాలయంలోని ఈఈ సంఘం కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సమావేశంలో కాలేజ్ ప్రిన్సిపాల్ శరణప్పను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కాలేజ్ ప్రిన్సిపాల్ శరణప్పపై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 504, 506, 509 సెక్షన్ల కింద లైంగిక ప్రేరేపణ, లైంగిక వేధింపులు, ప్రాణహాని వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ విషయమై యాజమాన్య బోర్డు నోటీసు జారీ చేసి ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కాలేజ్ ప్రిన్సిపాల్ శరణప్పకు గతంలోనే సూచించారు.
అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ శరణప్ప నోటీసులకు స్పందించకపోవడం, ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో బోర్డు సమావేశంలో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నామని బోర్డు అధికారులు ఆదేశించారు. ప్రముఖ 'కన్నడ దిన పత్రిక కన్నడప్రభతో మాట్లాడిన విశ్వవిద్యాలయం కోశాధికారి గోనల్ రాజశేఖరగౌడ్ కాలేజ్ ప్రిన్సిపల్ శరణప్పపై బోర్డు సంఘం సీరియస్‌గా నిర్ణయం తీసుకుందని వివరించారు. బోర్డు సంఘం ఆదేశాల మేరకు కాలేజ్ ప్రిన్సిపాల్ శరణప్పను సస్పెండ్ చేశామని గౌడ వివరించారు.

లైంగిక వేధింపుల కేసుపై విచారణ కొనసాగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రంజిత్ కుమార్ బండారు తెలిపారు. ఈ కేసులో నిందితుడు శరణప్ప పరారీలో ఉన్నట్లు సమాచారం. లేడీ లెక్చరర్‌పై లైంగిక వేధింపుల కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న సంఘం నిందితుడు శరణప్పను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కాలేజ్ ప్రిన్సిపాల్ శరణప్ప మీద విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నామని విశ్వవిద్యాలయం బోర్డు సంఘం తెలిపింది.












Click it and Unblock the Notifications