వారికి మాత్రమే ఊరట
Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు ఇచ్చింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలను తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల మేర తగ్గింపును ప్రకటించింది. తగ్గించిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
దీనితో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,646 రూపాయలకు తగ్గింది. నోయిడా- రూ.1,636.60, లక్నో- రూ.1,758.50, డెహ్రాడూన్- రూ.1,716, వారణాసి- రూ. 1,819, చండీగఢ్- రూ.1,666, గుర్‌గావ్- రూ.1,653, పాట్నా- రూ.1,915.50, రాంచీ- రూ.1,804.50, సిమ్లా- రూ.1,744.50, భోపాల్- రూ.1,651, రాయ్‌పూర్- రూ.1,855, జైపూర్- రూ.1,668 పలుకుతోంది.

ఎల్పీజీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు కంపెనీలు. గృహావసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ-రూ. 803, కోల్‌కతా- రూ.829, ముంబై- రూ.802.50, చెన్నై- రూ. 818.50 పైసల మేర ఉంటోంది.
గతంలో వాణిజ్య అవసరాల సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఒకదశలో ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర గరిష్ఠంగా 2,500 రూపాయల వరకు వెళ్లిన రోజులు లేకపోలేదు. దీనిపట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. హోటళ్ల మనుగడ తలకిందులైంది.
కమర్షియల్ వంటగ్యాస్‌ను వినియోగించే చిరు వ్యాపారులు అనేక ఇక్కట్ల బారిన పడ్డారు. దీనికితోడు హోటళ్లల్లో వినియోగించే సిలిండర్ల ధర పెరగడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత దెబ్బతిన్నాయి. వారికి ఊరట కలిగించేలా.. కమర్షియల్ ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను తగ్గించింది కేంద్రం. మున్ముందు గృహావసర గ్యాస్ సిలిండర్ల రేట్లను కూడా తగ్గించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications