Condoms: వధువులకు ఇచ్చిన వెడ్డింగ్ కిట్లలో కండోమ్‍లు..
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ అధికారులు చేసిన ప్రస్తుతం ఇప్పడు చర్ఛనీయంశంగా మారింది. ప్రభుత్వం పెళ్లికిచ్చిన కిట్ లో పలు వస్తువులతో పాటు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2006లో కన్యా వివాహ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా పేదవారికి సామూహిక వివాహలు జరిపిస్తారు. ఈ పథకం కింద్ రూ.55,000 నగదు కూడా అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా తాజాగా ఝబువా జిల్లాలో ప్రభుత్వం 296 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు.
పెళ్లిళ్ల అనంతరం వారికి ప్రభుత్వం వెడ్డింగ్ కిట్స్ అందించింది. వెడ్డింగి కిట్లలో పలు మేకప్ వస్థువులతో పాటు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు ఉన్నాయి. దీంతో అందరు షాక్ అయ్యారు. వెడ్డింగ్ కిట్లలో కండోమ్ లు ఉండడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించారు. కుటంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకే కిట్లలో కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలు ఇచ్చామని చెప్పారు.

అయితే ఇది సరైన పద్ధతి కాదని కొందరు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ రాష్ట్ర ఆరోగ్యశాఖపై విమర్శలు గుప్పించారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేసే బాధ్యత తమది కాదని ఇదంతా ఆరోగ్యశాఖ చూసుకుంటుందన్నారు. ఆరోగ్య శాఖ తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు. గత నెలలో ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద జరిగిన సామూహిక వివాహ వేడుకలు నిర్వహించారు.
అప్పుడు పెళ్లి కూతుళ్లకు రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించడం సంచలనం సృష్టించింది. అయితే కొన్ని జంటలు పెళ్లికి సిద్ధం కాగా వారికి నిర్వహించిన ప్రెగ్నెన్సీ టెస్టుల్లో నలుగురికి పాజిటివ్ రావడం గమనార్హం. దీంతో ఆ నలుగురిని ఈ స్కీమ్‌కు అనర్హులుగా ప్రకటించారు. ఖర్చులు తగ్గించుకోవడాని ప్రభుత్వం నిచమైన పని చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. తాజాగా వెడ్డింగ్ కిట్లలో కండోమ్ లు రావడంపై కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications