Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ కొత్త జాబితా విడుదల

Congress 4th list: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. తన నాలుగో జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 46 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది.

ఈ రెండో జాబితాలో మధ్యప్రదేశ్- 12, ఉత్తర్‌ప్రదేశ్- 9, తమిళనాడు-7, మహారాష్ట్ర- 4, రాజస్థాన్- 3, మణిపూర్-2, జమ్మూ కాశ్మీర్- 2, ఉత్తరాఖండ్- 2, అస్సాం- 1, అండమాన్ నికోబార్-1, ఛత్తీస్‌గఢ్- 1, పశ్చిమబెంగాల్-1 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తమిళనాడులో డీఎంకేతో పొత్తులో ఉంది కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయి.

Congress 4th list Ajay Rai will contest from Varanasi

కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఈ జాబితాలో చోటు దక్కింది. తమిళనాడులోని శివగంగ నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తోన్నారు. ఇది చిదంబరం కుటుంబం సొంత నియోజకవర్గం. పీ చిదంబరం ఇక్కడి నుంచే ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయన కుమారుడు కార్తీ ఇక్కడ విజయం సాధించారు.

కృష్ణగిరి- కే గోపీనాథ్, కరూర్- ఎస్ జోతిమణి, కడలూర్- డాక్టర్ ఎంకే విష్ణుప్రసాద్, విరుధ్ నగర్- బీ మాణిక్కం ఠాగోర్, కన్యాకుమారి- విజయ్ వసంత్‌లను బరిలోకి దించింది. మాణిక్కం ఠాగోర్‌ గతంలో తెలంగాణకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా పని చేసిన విషయం తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నటి రాధికా శరత్‌కుమార్ పోటీలో ఉన్నారు.

ఇదివరకు 36 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణకు చోటు దక్కింది. మొత్తం నలుగురి పేర్లను పొందుపరిచింది. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ నుంచి గానీ, ఏపీ నుంచి గానీ అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+