వుయ్ డిడ్ ఎ మిస్టేక్: మునిగామని అప్పుడే చెప్పాడు: మనమే అర్థం చేసుకోలేకపోయాం
జనతాదళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. మరో విడత బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది వరుసగా అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఈ నెల 15 లేదా 18వ తేదీన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ప్రభంజనం సృష్టించింది ఎప్పట్లాగే. మొత్తం 75 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జేడీయూకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే వార్తలు వెలువడినప్పటికీ.. ఈ ఫలితాలను బట్టి చూస్తోంటే..అవన్నీ కూడా పటాపంచలయ్యాయి. రికార్డు స్థాయిలో భారీ మెజారిటీని సాధిస్తోన్నారు జేడీయూ అభ్యర్థులు.

కాగా- కనీస పోటీ ఇవ్వలేకపోతోంది రాష్ట్రీయ జనతాదళ్ - కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి. 2020లో సాధించినన్నీ సీట్లు కూడా దక్కట్లేదా కూటమికి. ఆర్జేడీ గానీ, కాంగ్రెస్ గానీ.. ఏ మాత్రం నిలువలేకపోతున్నాయి. ఏకపక్షంగా మార్చివేశాయి. ఎన్డీఏ ప్రభంజనం కనిపిస్తోంది బీహార్ లో. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపుగా 200 సీట్ల మార్క్ కు చేరువగా కనిపించింది. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ సీట్లు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడే గానీ తగ్గుదల కనిపించట్లేదు. క్లీన్ స్వీప్ చేసినట్టయింది.
కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిందీ ఎన్నికల్లో. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా దక్కించుకునేలా కనిపించట్లేదు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉన్న సీట్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తాజా సమాచారం ప్రకారం.. హస్తం పార్టీ ఏడు సీట్లల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. చివరాఖరికి ఆ సీట్లు కూడా లభిస్తాయనేది అనుమానమే. ప్రతి రౌండ్ కూ ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది. కాంగ్రెస్ క్యాండిడేట్లు వెనుకంజలో ఉంటోన్నారు.
ఈ ఎన్నికలు కాంగ్రెస్ భారీ సెట్ బ్యాక్ గా పరిగణించవచ్చు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత అధ్వాన్నపు పరిస్థితులను ఎదుర్కొనలేదు. పైగా అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే క్షేత్రస్థాయిలో పర్యటనలు సాగించినప్పటికీ అటు రాహుల్ గాంధీకి గానీ, ఇతర పార్టీ నాయకులకు గానీ బీహార్ ఓటర్లు ఏ మాత్రం ఆదరించలేదనేది ఈ ఫలితాలతో తేలిపోతోంది. ఓటర్ల జాబితాపై చేపట్టిన కార్యక్రమాలు సైతం ప్రజాదరణను పొందలేకపోయాయి.
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications