నిత్యానందతో డీకే శివకుమార్ భేటీ ఫొటో: క్లారిటీ ఇస్తోన్న ట్రబుల్ షూటర్..!

బెంగళూరు: అత్యంత వివాదాస్పద పీఠాధిపతిగా పేరు తెచ్చుకున్న స్వామి నిత్యానందతో కలిసి ఫొటో దిగిన ఉదంతం ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ మెడకు చుట్టుకుంటోంది. నిత్యానంద ఆశ్రమంలో ఆయనతో కలిసి డీకే శివకుమార్ దిగిన ఫొటోలు తాజాగా వైరల్ గా మారుతున్నాయి. నిత్యానందపై గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడం, ఆ వెంటనే.. ఆయన అదృశ్యం కావడం, దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. డీకే శివకుమార్ ఫొటోలు చర్చనీయాంశమౌతున్నాయి. దీనిపై డీకే శివకుమార్ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.

బెంగళూరు శివార్లలోని బిడదిలో స్వామి నిత్యానందకు ఆశ్రమం ఉంది. దీని అనుబంధంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పీఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోనూ ఇలాంటి ఆశ్రమం ఒకటుంది. యోగిని సర్వజ్ఞపీఠం పేరుతో ఇది కొనసాగుతోంది. అహ్మదాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో దీన్ని నెలకొల్పారు. అహ్మదాబాద్ కే చెందిన జనార్ధన్ శర్మ కుమార్తెలు లోపముద్ర, నందిత ఈ ఆశ్రమంలో చదువుకుంటున్నారు.

Congress leader DK Shivakumar gave clarity on his viral photograph with Nithyananda

నిత్యానంద ధ్యానపీఠం ఆశ్రమంలో తమ ఇద్దరు కుమార్తెలు బందీలుగా ఉన్నారంటూ గుజరాత్ కు చెందిన దంపతులు ఆరోపించారు. తమ కుమార్తెలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేశారు. పీటీషన్ ను విచారణకు స్వీకరించిన గుజరాత్ హైకోర్టు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం అనంతరం నిత్యానంద అదృశ్యం అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లారు.

అదే సమయంలో డీకే శివకుమార్.. నిత్యానందతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ గా మారడం కర్ణాటకలో దుమారాన్ని రేపింది. దీనిపై శివకుమార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిత్యానందతో తాను దిగిన ఫొటో ఇప్పటిది కాదని, ఏడాది కిందటిదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తాను నిత్యానంద ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో ఆయనను కలుసుకున్నానని అన్నారు.

Congress leader DK Shivakumar gave clarity on his viral photograph with Nithyananda

నిత్యానంద ఆశ్రమం ఉన్న బిడది ప్రాంతం తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉందనే విషయాన్ని డీకే శివకుమార్ గుర్తు చేశారు. ఓ రాజకీయ నాయకుడిగా తాను అందర్నీ కలుస్తుంటానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులను కలిశానని అన్నారు. నిత్యానందతో కలిసి దిగిన ఫొటోలు వివాదానికి దారి తీస్తాయని తాను అనుకోవట్లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+