హ్యాట్రిక్ హీరో ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్, బావమరిదికి మంత్రి పదవి గ్యారెంటీ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి పదవులు ఆశీస్సున్న ఎమ్మెల్యేలు చాలా మంది క్యూలో ఉన్నారు. సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ కుమార్ ఫ్యామిలీలో కూడా మంత్రి పదవి ఆశిస్తున్న లీడర్ ఉన్నారు. హీరో బావమరిదికి మంత్రి పదవి గ్యారెంటీ అని తెలిసింది.
ఇదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా బెంగళూరులోని మన్యతా టెక్ పార్క్ సమీపంలోని డాక్టర్ శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. మంగళవారం రణదీప్ సింగ్ సూర్జేవాలా నేరుగా హీరో శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి చాలా సేపు చర్చించారు.

తాను ప్రముఖ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లానని స్వయంగా రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలోని వివిద అసెంబ్లీ నియోజక వర్గాల్లో డాక్టర్ శివరాజ్ కుమార్, గీతా శివరాజ్ కుమార్ దంపతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారని రణదీప్ సింగ్ సూర్జేవాలా గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడిన డాక్టర్ శివరాజ్ కుమార్, ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ కు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం వారి ఇంటికి తాను వెళ్లానని, చాలా సేపు చర్చలు జరిపామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా వివరించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా డాక్టర్ శివరాజ్ కుమార్ తో ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది.

ఇక మాజీ సీఎం బంగారప్ప కుమార్తె గీతాను హీరో శివరాజ్ కుమార్ వివాహం చేసుకున్నారు. బంగారప్ప కుమారులు మధు బంగారప్ప, కుమార బంగారప్ప విడిపోయారు. శివమొగ్గ జిల్లాలోని సోరబ అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ, కాంగ్రెస్ టిక్కెట్లతో కుమార బంగారప్ప, మధు బంగారప్ప పోటీ చేశారు.
సోరబ నియోజక వర్గంలో సోదరుడు మధు బంగారప్ప గెలుపు కోసం శివరాజ్ కుమార్ తో పాటు ఆయన భార్య గీతా శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. మధు బంగారప్ప ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తనకు మంత్రి పదవి రాలేదని మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప నిరాశతో ఉన్నారు.
Was indeed a pleasure and honour to meet with one and only Sh. Shiva Rajkumar @NimmaShivanna & Geetha Shivarajkumar at their residence.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 23, 2023
Thanked one of the most popular artist and even a better human being for powering the Congress campaign and participating in the festival of… pic.twitter.com/mrkefIwfpY
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా డాక్టర్ శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో హీరో బావమరిది మధు బంగారప్పకు మంత్రి పదవి గ్యారెంటీ అని తెలిసింది. శివమొగ్గ జిల్లాకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే డిసైడ్ అయ్యిందని తెలిసింది. డాక్టర్ శివరాజ్ కుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాల చర్చలతో మధు బంగారప్పకు మంత్రి గ్యారెంటీగా వస్తోందని ఈ రోజు జరిగిన చర్చలను బట్టి అర్థం అవుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications