మహిళలతో అసభ్యంగా.. కామ బాబా అరెస్ట్, పోర్న్ సీడీలు లభ్యం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. బాబా ముసుగులో మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణల పైన బాబా పరమానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
లక్నోకు సమీపంలోని బారాబంకీలో రాంశంకర్ తివారీ అలియాస్ బాబా పరమానంద ఆశ్రమం నడుపుతున్నాడు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అంతకుముందు పిల్లల్ని పుట్టిస్తానని చెప్పి తమతో చెప్పేందుకు వీల్లేని విధంగా అసభ్య చేష్టలు చేశాడని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు.

ఆయన ఆశ్రమంపై దాడి చేయగా.. మహిళలతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సీడీలు, పోర్న్ చిత్రాల సీడీలూ వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. పరమానంద మధ్యప్రదేశ్‌లోని సాత్నా ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకుని బారాబంకీ పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications