మళ్లీ అంతే.. కేరళలో తగ్గని కరోనా ఉధృతి
కేరళలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. జూ 25 వేలకు తగ్గకుండా కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 25,772 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్తగా 27,320 మంది కరోనా బాధితులు ఆ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రికవరీల 39,93,877కు చేరింది. కొత్తగా ఇవాళ 189 మంది కరోనా బాధితులు మరణించడంతో మృతుల సంఖ్య 21,820కి పెరిగింది.
Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)
కేరళలో ఒకవైపు పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నది. ఇవాళ జరిగిన కొవిడ్-19 రివ్యూ మీటింగ్‌లో.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతోపాటు, ఆదివారం లాక్‌డౌన్‌ను కూడా తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియాకు వెల్లడించారు.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
MalavikaMohanan : చీరలో మాళవిక హంగామా.. మీరు ఎప్పుడూ చూడని ఫోటోలు
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు.
ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
