coronavirus: ఎవరూ మాస్క్ ధరించాలి, ఎప్పుడు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ..?
కరోనా వైరస్ వ్యాపిస్తోండటంతో భయాందోళన నెలకొంది. వైరస్‌కు మందు లేకపోవడం, నివారణ ఒక్కటే మార్గం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తుమ్మితే వచ్చే తుంపిర్లు, చేతులు మొహానికి అంటుకోవడంతో వైరస్ సోకుతోంది. దీంతో మాస్క్‌లు ధరించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఎవరూ మాస్క్ ధరించాలి..? మాస్క్ ధరించేందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా..? అనే అంశంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు అని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ఒకవేళ మీకు దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటే మాత్రమే మాస్క్ ధరించాలని సూచిస్తోంది. మీరు కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స ఇస్తున్నట్లైతే మాస్క్ ధరించాలని సజెస్ట్ చేశారు. వైరస్ అనుమానిత వ్యక్తులకు వైద్య సాయం అందజేస్తున్న ఆరోగ్య కార్యకర్త అయినా మాస్క్ ధరించాలని స్పష్టంచేసింది.

మాస్క్ ధరించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కేంద్ర వైద్యారోగ్యశాఖ వివరించింది. వైరస్ సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేవారు ప్రతీ 6 గంటలకు ఒకసారి మాస్క్ మార్చాలని సూచించింది. లేదంటే మాస్క్ తడిగా మారే అవకాశం ఉందని హెచ్చరించంది. ముక్కు, నోరు, గదవను కవర్ చేస్తూ మాస్క్ ధరించాలని.. ఒక్కసారి ధరిస్తే తీయొద్దని.. ముక్కు నుంచి గదవ వరకు ఉండాలని గ్యాప్ ఉంచొద్దని సలహాచెప్పింది.
Recommended Video
డిస్పోజబుల్ మాస్క్‌లను ఒకసారి వాడి డస్ట్ బిన్‌లో పడేయాలని.. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని తేల్చిచెప్పింది. మాస్క్ పెట్టుకున్నాక దానిని చేతులతో ముట్టుకోవద్దని తెలిపింది. మాస్క్ వాడే సమయంలో దానిని తీసి భుజాలకు వేసుకోవద్దని స్పష్టంచేసింది. మాస్క్ తీసేసిన తర్వాత చేతులను సబ్బు లేదా, శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలని సూచించింది. మాస్క్ ఎలా వాడాలనే అంశంపై సందేహాం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1075, 011-23978046 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరింది. సందేహాల కోసం [email protected]కు మెయిల్ చేయాలని సూచించింది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications