Coronavirus: సిలికాన్ సిటీలో 38 వార్డులు కరోనా హాట్ స్పాట్స్; ఒక్కడి దెబ్బకు 50 మందికి వైరస్ !

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు భయపడని మానవుడు ఉన్నాడా అంటే లేడనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో 1, 26, 681 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటి వరకు 19, 81, 239 మంది కరోనా వైరస్ వ్యాధి సోకింది. భారతదేశంలో 11, 439 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో భాదపడుతున్న 1, 306 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ చికిత్స విఫలమై భారత్ లో ఇప్పటి వరకు 377 మంది మరణించారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ రోజురోజుకు ఎక్కువగా వ్యాపిస్తోంది. ఒక్కడి దెబ్బకు 50 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు చెప్పారు. ఈ సందర్బంలో 38 వార్డులు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా ప్రకటించారు. బెంగళూరులో ఈ 38 వార్డుల ప్రజలు సిటీలోని ఇతర ప్రాంతాలకు సంచరించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 బెంగళూరులో 38 వార్డులు

బెంగళూరులో 38 వార్డులు

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) పరిధిలో మొత్తం 198 వార్డులు ఉన్నాయి. 198 వార్డుల్లో 198 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులోని 38 వార్డులు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు గుర్తించామని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ తెలిపారు.

 3 కిలోమీటర్లు బఫర్ జోన్

3 కిలోమీటర్లు బఫర్ జోన్

బెంగళూరు నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన వార్డుల్లోని 3 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలను బఫర్ జోన్ గా ప్రకటించామని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించిన వార్డులను కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించామని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ తెలిపారు.

 రెండు ప్రాంతాలు సీల్ డౌన్

రెండు ప్రాంతాలు సీల్ డౌన్

సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలోని బీబీఎంపీ వార్డు నెంబర్ 134 బాపూజీనగర్, వార్డు నెంబర్ 135 పాదరాయణపుర ప్రాంతాలు నాలుగు రోజుల క్రితమే పూర్తిగా సీల్ డౌన్ అయ్యాయి. పాదరాయణపుర, బాపూజీనగర్ వార్డుల్లో 45 వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ రెండు వార్డుల ప్రజలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ రెండు వార్డుల్లో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు వస్తే పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు.

 ఇంటింటికి సరుకులు

ఇంటింటికి సరుకులు

బాపూజీనగర్, పాదరాయణపుర వార్డుల ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాలు తదితర నిత్యవసర వస్తువులను బీబీఎంపీ అధికారులు వాళ్ల ఇళ్ల దగ్గరకే వెళ్లి అందిస్తున్నారు. రెండు వార్డులు పూర్తిగా సీల్ డౌన్ కావడంతో బెంగళూరు నగరంలో మిగిలిన వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ చేస్తారని ప్రజల్లో ఆందోళన మొదలైయ్యింది.

 ఒక్కడి దెబ్బకు 50 మందికి కరోనా !

ఒక్కడి దెబ్బకు 50 మందికి కరోనా !

గత 28 రోజుల్లో బెంగళూరు నగరంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికారులు అంటున్నారు. అయితే అప్పటికే కరోనా వైరస్ వ్యాధి సోకిన ఒకవ్యక్తి వలన 50 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని, ఆ వ్యక్తులు సంచరించిన వార్డులు ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు.

 కరోనా సీల్ డౌన్ భయం !

కరోనా సీల్ డౌన్ భయం !

ప్రస్తుతానికి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన బాపూజీనగర్, పాదారయణపు వార్డులు మాత్రమే సీల్ డౌన్ చేశారు. అయితే బెంగళూరు నగరంలోని 38 వార్డులు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించడంతో ఎక్కడ బెంగళూరు మొత్తం సీల్ డౌన్ చేస్తారో అనే భయం ప్రజల్లో ఉంది. అయితే బెంగళూరు మొత్తం కరోనా సీల్ డౌన్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ తెలిపారు.

బెంగళూరు కరోనా హాట్ స్పాట్స్ !

బెంగళూరు కరోనా హాట్ స్పాట్స్ !

సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా హాట్ స్పాట్ వార్డులను బీబీఎంపీ కమిషనర్ బిహెచ్. అనీల్ కుమార్ ప్రకటించారు. ధణిసంద్ర ( వార్డు నెంబర్ 6), రాధాక్రిష్ణ దేవస్థానం (18), హోరమావు (25), అరమనె నగర్ (35), హూడి (54), మారుతీ సేవానగర్ (59), నాగాపుర (67), హగదూరు (67), వసంతనగర్ (93), సుధామనగర (118), నాగరబావి (128), బాపూజీనగర్ (134), పాదరాయణపుర (135), ఆజాద్ నగర్ (141), వర్తూరు (149), గిరినగర్ (162), గురప్పనపాళ్య (171), జేపీనగర్ (177), సింగసంద్ర (191), బ్యాటరాయణపుర (7), గంగానగర్ (20), రామమూర్తి నగర్ (26), లింగరాజపుర (49), సీవీ రామనగర్ (57), రామస్వామిపాళ్య (62), గరుడాచారపాళ్య (82), జీవన్ భీమానగర్ (88), శివనగర్ (107), హోసహళ్ళి (124), అత్తిగుప్ప (132), జగజ్జీవన్ రామ్ నగర్ (136), ఆడుగోడి (147), సుద్దగుంటపాళ్య (152), కరిసంద్ర (166), మడివాళ (172) వార్డులను కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించామని బీబీఎంపీ కమిషనర్ బిహెచ్, అనీల్ కుమార్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+