India vs Bharat : ఇప్పటివరకు ఎన్ని దేశాలు పేరు మార్చుకున్నాయో తెలుసా..?
భారతదేశాన్ని ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు ఇండియా పేరును తొలగించి భారత్ పేరును ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.దీనికి సంబంధించినటువంటి అన్ని కసరత్తులను మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇండియా పేరు మార్పు గురించే పెద్ద చర్చ సాగుతుంది. దేశం పేరు మార్పును కొందరు స్వాగతిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.
అయితే భారతదేశం కంటే ముందే చాలా దేశాలు తమ పేరు మార్చుకున్నాయి. ఆయా దేశాల పేర్లు మార్చడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ విషయం పక్కన పెడితే.. పేర్లు మార్చుకున్న కొన్ని దేశాలను ఓ సారి పరిశీలిద్దాం.
మన పక్క దేశం అయిన శ్రీలంకను మొదట్లో సిలోన్ , సింహళం అని పిలిచేవారు. కాని కాల క్రమేణా శ్రీలంక పేరుగా మార్చుకుంది. శ్రీలంక అంటే ప్రకాశవంతమైన భూమి అని అర్థం వస్తుంది. తమ దేశానికి ఆ పేరు సరిగ్గా సరిపోతుందని 1972లో శ్రీలంకగా పేరు మార్చుకున్నారు.

బర్మా ఒకప్పుడు మన భారత భూభాగంలోనే కొనసాగేదని చాలామందికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళ పాలించే సమయంలో బర్మా ప్రత్యేక దేశంగా అవతరించింది. 1989లో బర్మా దేశం పేరు మయన్మార్‌గా మార్చబడింది.

విలాసవంతమైన జీవితానికి థాయిలాండ్ పెట్టింది పేరు. అక్కడ మసాజ్‌కు ఇంటర్‌నేషనల్ లేవల్లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. థాయిలాండ్‌ను 1939కి ముందు వరకు సియామ్ అని పిలిచేవారు.స్వేచ్ఛ భావాలను ప్రకటించడం కోసం అక్కడి ప్రజలు థాయిలాండ్ పేరును ఎంచుకున్నారు.

మరో పక్క దేశం అయిన బంగ్లాదేశ్‌ను మొదట ఈస్ట్ బెంగాల్ అని పిలిచేవారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పాకిస్థాన్ విభజించబడింది. తరువాత పాకిస్థాన్‌తో అంతర్గత విభేదాలు తలెత్తడంతో..యుద్ధం చేసి మరి స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది.1971 తరువాత ఈస్ట్ బెంగాల్ అనే పేరును మార్చుకుని బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది.
వీటితో పాటు చెక్ రిపబ్లిక్ , స్లోవేకియా, రిపబ్లిక్‌కి జైర్, నార్త్ మెసిడోనియా వంటి దేశాలు కూడా పేర్లు మార్చుకున్న జాబితాలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications