పెళ్లి కాకుండా హోటల్ కు వెలితే ఇదే జరిగేది, కాలేజ్ లవర్స్, ?, ఆంటీ స్కెచ్ !

బెంగళూరు: యువతి మొబైల్ ఫోన్ కు ఆమె నగ్నంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ప్రైవేట్ వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ ప్రైవేట్ హోటల్ యజమిని అయిన మహిళతో సహా ఇద్దరిని బెంగళూరు సిటీలోని చంద్రా లేఅవుట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు నగరంలోని
కెంగేరికి చెందిన కిరణ్ (28), నయనా అలియాస్ నయా అంటీ (44)లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. 22 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

 romancing

కర్ణాటకలోని ఉడిపికి చెందిన నిందితులు కిరణ్, నయనా దంపతులు నగరంలోని కెంచన్‌పురలోని కెంగేరి మెయిన్ రోడ్డులో హోటల్ (లాడ్జ్) నడుపుతున్నారు. బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న ఓ యువతి ఇటీవల తన స్నేహితుడితో కలిసి ఈ హోటల్‌కు వెళ్లి రూమ్ తీసుకుని ఒక్కరోజు ఏకాంతంగా గడిపింది.

కాలేజ్ అమ్మాయి, ఆమె ప్రియుడు రొమాన్స్ చేస్తున్న సమయంలో హోటల్ లోని రూమ్ లో సీక్రెట్ కెమెరాలో రికార్డు చేసిన నిందితుడు కిరణ్ తరువాత ఆ యువతి మొబైల్ ఫోన్ కు ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పంపించాడు. యువతి ఫోటోలు, వీడియోలు చూసిన తరువాత వెంటనే కిరణ్ వాటిని డిలీట్ చేశాడు.

 romancing

తరువాత యువతికి ఫోన్ చేసిన కిరణ్ డీల్ మాట్లాడాడు. నువ్వు మా హోటల్ గదిలో నీ స్నేహితుడితో గడిపిన ప్రైవేట్ క్షణాల వీడియోలు, ఫోటోలు మా దగ్గర ఉన్నాయని, నువ్వు నాకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, డబ్బులు ఇవ్వకపోతే నీ అసభ్యకర వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని కిరణ్ కాలేజ్ అమ్మాయిని బెదిరించాడు.

సోషల్ మీడియాలో నీ వీడియోలు అప్ లోడ్ చెయ్యడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఆ వీడియోలు పంపిస్తానని కిరణ్ కాలేజ్ అమ్మాయిని బెదిరించాడు. పలుమార్లు యువతికి ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. కిరణ్ టార్చర్ పెట్టడంతోతో విసిగివేసారిన యువతి గత్యంతరంలేక బెంగళూరులోని చంద్రాలేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

కాలేజ్ అమ్మాయి ఫిర్యాదుపై విచారణ చేసిన పోలీసు అధికారులు కిరణ్, నయనా అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటల్ యజమాని కూడా అయిన నయనాకు బాధితురాలు సమీప బంధువు. బాధితురాలు తరచూ హోటల్‌కు వస్తుండడంతో నిందితుడు కిరణ్‌కు ఆమెకు పరిచయం అయ్యాడు.

 romancing

ఇటీవల బాధితురాలు తన స్నేహితుడితో కలిసి హోటల్‌కు వెళ్లి గదిని అద్దెకు తీసుకుని వ్యక్తిగతంగా గడిపింది. కాగా నిందితుడు కిరణ్ గదిలో సీక్రెట్ కెమెరాను ఉంచి కాలేజ్ లవర్స్ ప్రైవేట్ క్షణాలను రికార్డు చేశారు. ఈ విషయం నయనాకు కూడా తెలుసు అని, ఆ వీడియోను ఉపయోగించి బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేయాలని నిందితుడు కిరణ్ కు నయనా సహకరించిందని, ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. సొంత బంధువు అయిన కాలేజ్ అమ్మాయి జీవితంతో ఆడుకున్న నయనాను పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+