సెక్స్ స్కాండల్ కేసులో షాక్, అయ్యగారికి నో బెయిల్, ఆ కేసులో ట్విస్ట్, సిట్ కస్టడీలో ?

హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయపోరాటంలో కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక కోర్టు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఆయన ప్రస్తుతం సిట్ కస్టడీలో ఉన్నారు. బెంగళూరులోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి గజానన భట్ బుధవారం ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.

మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా అందులో ఒక కేసులో బెయిల్ పొందారు. హలేనరసీపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో బెయిల్ కోసం ప్రజ్వల్ ప్రజాప్రతినిధి ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, తన ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉందని, బెయిల్ మంజూరు చెయ్యాలని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కోర్టును ఆశ్రయించాడు.

Court denied bail to former MP Prajwal Revanna in sex scandal case

గతంలో కేఆర్ నగర పోలీస్ స్టేషన్‌లో నమోదైన మహిళ అపహరణ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు అయ్యాడు. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై ఉన్న అన్ని కేసులను విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు కేసులను విచారిస్తున్న సిట్ ప్రజ్వల్ రేవణ్ణను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి స్థానికంగా విచారణ జరుపుతోంది. ప్రజ్వల్ రేవణ్ణతో కలిసి హాసన్ జిల్లాలోని హలేనరసీపురలోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ హాసన్ మాజీ ఎంపీ ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ఇంటిలో సోదాలు చేశారు.

ఏప్రిల్ 26వ తేదీన లోక్‌సభ ఎన్నికలకు 2024లో ఓటు వేసి విదేశాలకు పారిపోయారు. విదేశాల్లో తలదాచుకున్న అతడు మే 31వ తేదీన రాష్ట్రానికి వచ్చాడు. అనంతరం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పటేల్ 6,72,988 ఓట్లతో విజయం సాధించారు. ప్రజ్వల్ రేవణ్ణ 6,30,339 ఓట్లు సాధించి ఓడిపోయారు. తాను పార్లమెంటు సభ్యునిగా ఉన్న సమయంలో హొళేనరసీపూర్‌లోని రేవణ్ణ హాసన్‌ ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజ్వల్ లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+