Cousin: కల్యాణమండపం బాత్ రూమ్ లో యువతి మీద కజిన్ బ్రదర్ ?, చివరికి చంపేసిన కామాంధుడు !

లక్నో/మీరట్: వివాహం చేసుకుంటున్న యువతి, యువకుడి కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు అందరిని శుభకార్యానికి పిలిచారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువులు చాలా మంది ఆ పెళ్లికి వెళ్లారు. 19 ఏళ్ల యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లారు. యువతి కజిన్ బ్రదర్ కూడా ఆ పెళ్లికి హాజరైనాడు. రాత్రి గ్రాండ్ గా రిసెప్షన్ జరిగింది. అర్దరాత్రి యువతితో పాటు ఆమె కజిన్ బ్రదర్ కొన్ని గంటల పాటు కనపడకుండా పోయారు. కుటుంబ సభ్యులు కల్యాణమండపంతో పాటు పరిసర ప్రాంతాలు గాలించారు. కొన్ని గంటల తరువాత వాష్ రూమ్ లో డోర్ పగలగొట్టి చూడగా పెళ్లికి వెళ్లిన యువతి బట్టలు మొత్తం చినిగిపోయి శవమై కనిపించింది. వాష్ రూమ్ పక్కనే ఉన్న మరో గదిలో పీకలదాక మద్యం సేవించి మత్తులో ఊగుతున్న పోలీసులు ఉండటంతో బాధితురాలి బంధువులు అందరూ కలిసి ఆ పోలీసును చికతబాదేశారు. పోలీసులు ఆ యువతి మీద అత్యాచారం చేసి చంపేశాడని అనుకున్నారు. అయితే మరుసటి రోజు యువతి కజిన్ బ్రదర్ ను పోలీసులు పట్టుకోవడంతో అసలు కథ మొత్తం బయటకు రావడం కలకలం రేపింది.

 పెళ్లికి హాజరైన బంధువులు

పెళ్లికి హాజరైన బంధువులు


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నివాసం ఉంటున్న యువతి, యువకుడి పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. మీరట్ లోని కల్యాణమండపంలో పెళ్లి చేశారు. వివాహం చేసుకుంటున్న యువతి, యువకుడి కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు అందరిని శుభకార్యానికి పిలిచారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువులు చాలా మంది ఆ పెళ్లికి వెళ్లారు.

యువతి కజిన్ బ్రదర్ !

యువతి కజిన్ బ్రదర్ !


మీటర్ సమీపంలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లారు. స్వప్నా కజిన్ బ్రదర్ రాకేష్ (పేరు మార్చడం జరిగింది) కూడా ఆ పెళ్లికి హాజరైనాడు. రాత్రి గ్రాండ్ గా పెళ్లి రిసెప్షన్ జరిగింది. స్వప్నా వెంట ఆమె కజిన్ బ్రదర్ రాకేష్ తిరగడం మొదలుపెట్టాడు.

అర్దరాత్రి మాయం అయిన యువతి

అర్దరాత్రి మాయం అయిన యువతి


మరుసటి రోజు ముహూర్తం చూసుకుని వెళ్లాలని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి ముఖ్యమైన బంధువులు అదే కల్యాణమండపంలోని రూమ్ లో ఉండిపోయారు. అర్దరాత్రి స్వప్నా కనపడకుండా పోయింది, స్వప్నాతో పాటు ఆమె కజిన్ బ్రదర్ రాకేష్ కూడా కొన్ని గంటల పాటు కనపడకుండా పోయారు. కుటుంబ సభ్యులు కల్యాణమండపంతో పాటు పరిసర ప్రాంతాలు స్వప్నా కోసం గాలించారు.

వాష్ రూమ్ లో శవమై కనిపించిన యువతి

వాష్ రూమ్ లో శవమై కనిపించిన యువతి

బంధువులు అందరూ తెలిసిన వారికి ఫోన్ చేసి స్వప్నా గురించి ఆరా తియ్యడం మొదలు పెట్టారు. ఓ వ్యక్తికి అనుమానం వచ్చి వాష్ రూమ్ ల్లో చూద్దామని స్వప్నా కుటుంబ సభ్యులకు చెప్పాడు. తరువాత వాష్ రూమ్ లో డోర్ పగలగొట్టి చూడగా పెళ్లికి వెళ్లిన యువతి బట్టలు మొత్తం చినిగిపోయి శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వెళ్లి వారు హడలిపోయారు. యువతి మీద కామాంధుడు చాలా కాలం నుంచి కన్ను వేశాడని అయితే ఆమె అతనికి లొంగలేదని బంధువులు అంటున్నారు. చాలా కాలం నుంచి ఆమె మీద కోరిక ఉన్న కామాంధుడు పెళ్లిలో ఆమె ఒంటరిగా చిక్కడంతో మాయమాటలు చెప్పి వాష్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి చంపేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

పక్కరూమ్ లో మద్యం మత్తులో పోలీసు

పక్కరూమ్ లో మద్యం మత్తులో పోలీసు


యువతి శవమై కనిపించిన వాష్ రూమ్ పక్కనే ఉన్న మరో గదిలో పీకలదాక మద్యం సేవించి మత్తులో కిందపడి ఊగుతున్న పోలీసు ఉండటంతో బాధితురాలి బంధువులు అందరూ కలిసి ఆ పోలీసులు పట్టుకుని చికతబాదేశారు. తీవ్రగాయాలైన పోలీసులును ఆసుపత్రికి తరలించారు. తాను మద్యం సేవించి రూమ్ లో నిద్రపోయానని, ఆ యువతిని నేను చూడలేదని పోలీసు పదేపదే పోలీసు అధికారులకు చెప్పాడు. మొదట ఆ యువతి మీద అత్యాచారం చేసి ఆ పోలీసు చంపేశాడని ఆమె కుటుంబ సభ్యులు బంధువులు అనుకున్నారు.

రేప్ చెయ్యాడని ప్రయత్నించి చంపేసిన కజిన్ బ్రదర్

రేప్ చెయ్యాడని ప్రయత్నించి చంపేసిన కజిన్ బ్రదర్


యువతితో పాటు తిరుగుతున్న ఆమె కజిన్ బ్రదర్ రాకేష్ కనపడకపోవడంతో అతని కోసం పోలీసులు గాలించారు. మరుసటి రోజు మీరట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రాకేష్ పోలీసులకు చిక్కిపోయాడు. తాను యువతిని వాష్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి తన కోరిక తీర్చాలని చెప్పానని, ఆమె ఎంత చెప్పినా నా మాట వినకపోవడంతో అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశానని, యువతి ఎదురు తిరగడంతో చివరికి తానే ఆమెను చంపేశానని రాకేష్ అంగీకరించాడని మీరట్ ఎస్పీ ప్రభాకర్ చౌదరి మీడియాకు చెప్పారు.

 హడలిపోయిన బంధువులు

హడలిపోయిన బంధువులు


రాకేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మీరట్ ఎస్పీ ప్రభాకర్ చౌదరి అన్నారు. పెళ్లి జరిగే కల్యాణమండపంలో ఓ యువతి మీద అత్యాచారయత్నం జరిగింది చివరికి ఆమె హత్యకు గురి కావడంతో పెళ్లి కోడుకు, పెళ్లి కూతురితో పాటు బంధువులు హడలిపోయారు. యువతి మీద తాను అత్యాచారం చెయ్యలేదని రాకేష్ చెబుతున్నాడని, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం తెలుస్తోందని మీటర్ పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+