వీడియో: కొమ్ములతో ఎత్తి కుదేసి.. గిట్టలతో తొక్కి..: బాలికపై ఆవు భయానక దాడి
చెన్నై: చెన్నైలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాల విద్యార్థినిపై ఓ ఆవు దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి కుదేసింది. గిట్టలతో తొక్కింది. ఈ ఘటనలో ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆవు బారి నుంచి బాలికను కాపాడారు. రక్తమోడుతున్న స్థితిలో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బాధిత బాలిక పేరు ఆయేషా. చెన్నై చోళైమేడు ప్రాంతంలో నివసిస్తోన్న జాఫర్ సిద్ధిఖ్ అలీ, హసీనా బాను కుమార్తె. స్కూల్ వదిలిన తరువాత ఆయేషా, కొడుకు ఉమర్‌తో కలిసి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో అరుంబాక్కం ఎంఎండీఏ కాలనీ, ఇళాంగో స్ట్రీట్ మీదుగా వెళ్తోన్న సమయంలో వారి పక్కనే ఉన్న ఓ ఆవు ఆయేషాపై దాడి చేసింది.

కొమ్ములతో గాల్లోకి ఎత్తి విసిరేసింది. కిందపడ్డ బాలికను గిట్టలతో తొక్కేసింది. ఆ ఆవుతో ఉన్న దూడ కూడా ఆ బాలికపై దాడి చేసింది. కిందపడ్డ బాలిక పైకి లేచే అవకాశం కూడా ఇవ్వలేదు. ముందరి కాళ్ల గిట్టలతో తొక్కేశాయి. అటు ఇటు విసిరేశాయి. ఆ రెండు మూగజీవాల కాళ్ల మధ్య నలిగిపోయిందా బాలిక.
“WARNING: DISTURBING VISUALS”
— மகாலிங்கம் பொன்னுசாமி / Mahalingam Ponnusamy (@mahajournalist) August 10, 2023
சென்னை அரும்பாக்கம் MMDA காலனி, இளங்கோ தெருவில் நடந்த கோர சம்பவம். மாடு முட்டியதில் சிறுமி படுகாயம் : பள்ளி முடிந்து சென்ற போது நேர்ந்த சோகம். சாலையில் செல்லும் மாடுகளை கடக்கும்போது எச்சரிக்கை அவசியம். pic.twitter.com/ejcXhREZEu
హసీనా బాను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు బయటికి వచ్చి, వాటిని తరిమివేశారు. ఒకసారి తరిమినప్పటికీ.. ఆ ఆవు మళ్లీ వెనక్కి వచ్చి.. మరీ ఆయేషాను కొమ్ములతో గాయపరిచింది. పైకి లేవ లేని స్థితిలో ఉన్న ఆయేషాను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆ వీధిలో ఓ ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఆయేషా తల్లిదండ్రులు అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆవు యజమాని వివేక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివేక్, దాడి చేసిన అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. బాలికకు తీవ్ర గాయాలయ్యాయని, కోలుకోవడాకి కొంత సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
-
జగన్ 2019 నినాదం, పథకాలతో బరిలోకి విజయ్- అక్కడే బిగ్ ట్విస్ట్..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications