Crackers: బీరు బాటిల్స్ లో టపాసులు పెట్టి ?, బుద్దిమాటలు చెప్పాడని హత్య, మైనర్లు !
ముంబయి: దీపావళి పండుగ సందర్బంగా కొందరు టపాకాయలు అంటించి గాల్లోకి విసిరి ఇతరుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం మనం చూశాము. కొందరు బీరు బాటిల్స్, గాజు సీసాలల్లో టపాకాయలు, బాంబులు పెట్టి పేల్చుతున్నారు. బీరు బాటిల్ లో లక్ష్మీటపాసులు పెట్టి కాల్చుతున్న అబ్బాయిలను ఓ వ్యక్తి మందలించాడు. బీరు బాటిల్స్ పగిలితే ఆ గాజు ముక్కలు ఇతరుల మీదపడి గాయలు అవుతాయని మందలించాడు. బుద్దిమాటలు చెప్పిన వ్యక్తిని ముగ్గురు అన్నదమ్ములు కలిసి కత్తులతో పొడిచి చంపేశారు. హత్య చేసిన ముగ్గురు అన్నదమ్ములు మైనర్లు కావడం కలకలం రేపింది.

గాల్లో టపాసులు
దీపావళి పండుగ సందర్బంగా కొందరు టపాకాయలు అంటించి గాల్లోకి విసిరి ఇతరుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విషయం మనం చాలాచోట్ల చూస్తున్నాము. కొంతమంది గాల్లో టపాలు విసరడం వలన అవి ఇష్టం వచ్చినట్లు పేలడంతో చాలా మందికి కంటి చూపు దెబ్బ తినడం, శరీరం మీద గాయాలు అవుతున్నాయి.

బీరు బాటిల్ లో లక్ష్మీ టపాసులు
ముంబాయి సిటీలోని శివాజీనగర్ గ్రౌండ్ ఏరియా సమీపంలో 12 ఏళ్ల అబ్బాయి సోమవారం రాత్రి టపాసులు కాల్చుతున్నాడు. బీరు బాటిల్స్, గాజు సీసాలల్లో టపాకాయలు, బాంబులు పెట్టి పేల్చుతున్నాడు. బీరు బాటిల్ లో లక్ష్మీటపాసులు పెట్టి కాల్చుతున్న అబ్బాయిలను స్థానికంగా నివాసం ఉంటున్న వ్యక్తి మందలించాడు.

ముగ్గురు మైనర్లు
బీరు బాటిల్స్ పగిలితే ఆ గాజు ముక్కలు ఇతరుల మీదపడి గాయలు అవుతాయని మందలించాడు. ఇంటికి వెళ్లిన ఆ అబ్బాయి అతని అన్నలకు మ్యాటర్ చెప్పాడు. ముగ్గరు సోదరులు మందలించిన వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు. మా ఇష్టం వచ్చినట్లు మేము టపాసులు కాల్చుకుంటాము, అడగడానికి నువ్వు ఎవరు అని బూతులు తిట్టారు.

హత్య చేసి ఎస్కేప్ అయిన సోదరులు
ఆ సందర్బంలో ముగ్గురు మైనర్లు, బుద్దిమాటలు చెప్పిన వ్యక్తి మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సందర్బంలో మైనర్లు రెచ్చిపోయారు. బుద్దిమాటలు చెప్పిన వ్యక్తిని ముగ్గురు అన్నదమ్ములు కలిసి కత్తులతో పొడిచి చంపేశారు. హత్య చేసిన ముగ్గురు అన్నదమ్ములు మైనర్లు కావడం కలకలం రేపింది. హంతకులకు 12, 14, 16 ఏళ్ల వయసు ఉంటుందని, చిన్న మాటకు హత్య చేశారని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications