Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంచు అందాలు చూడాలా..? తప్పక సందర్శించాల్సిన హిల్ స్టేషన్..!

ఎటు చూసినా శ్వేత వర్ణంతో.. మంచుతో కప్పబడి ఉన్న హిల్ స్టేషన్స్ అందాలను తిలకించేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. ఓ వైపు మంచు కురుస్తుంటే.. ఆ అద్భుత దృశ్యాలను తనివితీరా ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. మంచులో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇదో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు ఇక్కడి ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ లో ఈ హిల్ స్టేషన్ ఉంది.

జమ్ముకాశ్మీర్ లో ప్రముఖ టూరిస్టు ప్రాంతమైన గుల్మార్గ్ ప్రస్తుతం టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా ఈ సీజన్ లో ఇక్కడ మంచు వర్షం కురుస్తుంది. దాంతో ఎటు చూసినా శ్వేతవర్ణంతో పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి ఈ ప్రదేశాలు. గుల్మార్గ్ తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న జోజిలా, సోన్ మార్గ్, కుప్వారా ప్రాంతాలు సైతం బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ గుల్మార్గ్ హిల్ స్టేషన్.. కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని భూతల స్వర్గం, పూల భూమి అని రకరకాల పేర్లతో పిలుస్తారు స్థానికులు.

ఈ ప్రదేశానికి ముఖ్యంగా శీతాకాలంలో అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. ఈ ప్రాంతంలోని కొండలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. మంచులో సాహస క్రీడలైన స్కీయింగ్, స్నో బోర్డింగ్ ను మంచులో ఆడేందుకు పిల్లలు ఇష్టపడతారు. గుల్మార్గ్ శ్రీ నగర్ నుంచి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక హైదరాబాద్ నుంచి అయితే 2 వేల కిలోమీటర్లకుపైగానే ఉంది. విమానంలో అయితే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి శ్రీనగర్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు. ఎయిర్ పోర్టు నుంచి గుల్మార్గ్ 66 కి.మీ. ఉంటుంది. బస్సులు.. ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

Craving Real Snow Gulmarg in Winter is Pure Magic

ఇక రైలులో చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి జమ్ము తావి ఎక్స్ ప్రెస్(22705) రైలు ఎక్కాలి. జమ్ము తావిలో దిగి అక్కడి నుంచి శ్రీ నగర్ బస్సులో లేదా ట్యాక్సీలో వెళ్లాలి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ కు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అలాగే హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+