Crime: టీవీ సీరియల్ చూసి అచ్చం అలాగే భర్తను చంపేసింది, ప్రియుడి మోజులో పడి ఇంట్లో భర్తను ?

మండ్య/బెంగళూరు: లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో పరిస్థితులు తారుమారైనాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య ఆమె ఉద్యోగం చేస్తున్న చోట ఓ యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. మ్యాటర్ తెలుసుకున్న భర్త అతని భార్యను ఉద్యోగానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. ప్రియుడు దూరం కావడంతో భార్య బాయ్ ఫ్రెండ్ వ్యామోహంలో భర్త హత్యకు స్కెచ్ వేసింది. ప్రియుడిని ఇంటికి పిలిపించిన భార్య ఆమె భర్తను హత్య చేసింది. టీవీ సీరియల్ లో సీన్ చేసి అచ్చం అలాగే భర్తను హత్య చేయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

కర్ణాటకలోని మండ్యలో జిల్లా మళవళ్ళిలో శశికుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శశికుమార్, నాగమణి అనే యువతిని ప్రేమించాడు. తరువాత నాగమణి శశికుమార్ ప్రేమలో పడంది. రెండు సంవత్సరాలు హ్యాపీగా తిరిగిన ప్రేమికులు నాగమణి, శశికుమార్ 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

శశికుమార్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నాగమణి కనకపురలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న సమయంలో అదే గార్మెంటస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న హేమంత్ అనే యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. చాలాకాలం పాటు నాగమణి, హేమంత్ ల అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయినా ఇటీవల ఆ విషయం ఆమె భర్త శశికుమార్ కు తెలిసిపోయింది.

ప్రియుడిని ఇంటికి పిలిపించి భర్తను చంపేసింది

ప్రియుడిని ఇంటికి పిలిపించి భర్తను చంపేసింది


భార్య మ్యాటర్ తెలుసుకున్న శశికుమార్ అతని భార్య నాగమణిని ఉద్యోగం నలిపేసి ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని ఇంట్లో కుర్చోబెట్టాడు. ప్రియుడు హేమంత్ దూరం కావడంతో నాగమణి బాయ్ ఫ్రెండ్ వ్యామోహంలో భర్త శశికుమార్ ను లేపేయాలని స్కెచ్ వేసింది. ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్ ను ముందుగానే ఇంటికి పిలిపించుకున్న నాగమణి తరువాత ఇంటికి వచ్చిన భర్త శశికుమార్ ను హత్య చేసింది.

 శాంతం పాపం టీవీ సీరియల్ ఎఫెక్ట్ !

శాంతం పాపం టీవీ సీరియల్ ఎఫెక్ట్ !

తన ఇంట్లోకి ఎవరో చొరబడి నా భర్త శశికుమార్ ను హత్య చేశారని నాగమణి నాటకాలు ఆడింది. శశికుమార్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు నాగమణిని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. శాంతం, పాపం అనే కన్నడ టీవీ సీరియల్ లో సీన్ చేసి అచ్చం అలాగే తన ప్రియుడు హేమంత్ తో కలిసి తన భర్త శశికుమార్ ను హత్య చేశామని విచారణలో నాగమణి అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+