హలో నేను డీసీపీ, టెక్కీ బ్యాంక్ అకౌంట్ లో తేడాలు, విదేశాల్లో ఏం చేశావు ?
బెంగళూరు/ ముంబాయి: మీ బ్యాంకు ఖాతాలో అక్రమంగా నగదు బదిలీ జరుగుతోందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సైబర్ క్రిమినల్స్ బెదిరించి లక్షలు బదిలీ చేసినట్లు బెంగళూరు సెంట్రల్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అసలు మ్యాటర్ ఏమిటంటే తాను ముంబాయి డీసీపీని మాట్లాడుతున్నాను అంటూ టెక్కీని బెదిరించడం, లక్షల రూపాలయుల లూటీ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు నగరంలోని కన్నింగ్ హామ్ రోడ్ లోని అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న రోమిల్ తివారీ అలియాస్ తివారీ అలియాస్ రోమిల్ (30) అనే యువకుడు మోసపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రోమిల్‌కు ఆగస్టు 25న ఫెడెక్స్ అనే పేరుతో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు.

ఆ కాల్‌ను ముంబాయిలోని అంథేరీ డీసీపీకి కనెక్ట్ చేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. ఈ సమయంలో డీసీపీ వేషధారణలో మాట్లాడిన వ్యక్తి నీ బ్యాంక్ అకౌంట్‌ను అక్రమ నగదు లావాదేవీల కోసం వాడుకుంటున్నావని, నిన్ను త్వరలో పోలీసులు అరెస్టు చేస్తారని ముంబాయి డీసీపీ పేరుతో మాట్లాడిన వ్యక్తి అతన్ని బెదిరించాడు.
ఇప్పుడు డబ్బులు ఇస్తే నీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను, మీ బ్యాంకు లావాదేవీలు సవ్యంగా సాగుతాయి అని అవతలి వ్యక్తి టెక్కీ రోమిల్ కు చెప్పాడు. దీన్ని నమ్మిన రోమిల్ డీసీపీగా మాట్లాడిన వ్యక్తి ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు వివిధ దశల్లో రూ. 2. 68 లక్షలు బదిలీ చేశాడు. అయితే ముంబాయి డీసీపీగా చెప్పుకున్న వ్యక్తి మరింత డబ్బు డిమాండ్ చేయడంతో రోమిల్‌కు అనుమానం వచ్చింది.
పోలీసులు అయితే ఇంత డబ్బు తీసుకున్న తరువాత కేసు సాల్వ్ చెయ్యకుండా మళ్లీ ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తారు ? అంటూ రోమిల్ కు అనుమానం వచ్చింది. తాను సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్లు రోమిల్ ఆలస్యంగా గుర్తించాడు. అనంతరం బెంగళూరు సెంట్రల్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రోమిల్ ఫిర్యాదు చేశారు. సైబర్ మోసగాళ్ల ఆచూకీ కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications