Crocodile Attack: బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలి.. ఎక్స్ రే తీయించిన అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే..
ఉత్తరాఖండ్ లో ఓ బాలుడిని మొసలి నీటిలోకి లాక్కెల్లింది. ఈ ఘటన దేవా నదిలో జరిగింది. ఆదివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో యూపీ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మెహర్‌బన్‌నగర్ గ్రామానికి చెందిన మీనాదేవి, శోభాప్రసాద్ దంపతుల కుమారుడైన 11 ఏళ్ల వీర్ సింగ్ గేదెలను మేపేందుకు దేవా నది ఒడ్డుకు వెళ్లాడు.అకస్మాత్తుగా గేదె దేవహా నదిలోకి ప్రవేశించింది. అతడు గేదెను బయటకు తరిమేందుకు నదిలోకి దిగాడు. అక్కడే కాచుకోని ఉన్నమొసలి బాలుడిని నీటిలోకి లాక్కెళ్లింది.
స్థానికులు బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. డైవర్లు రోప్ నెట్ తో నదిలోకి దూకారు. గంటల తరబడి శ్రమించి, డైవర్లు మొసలిని నీళ్లలోంచి నెట్‌లో బంధించి బయటకు తీశారు. సమాచారం మేరకు ఖతిమా అటవీ శాఖ ట్రైనీ ఐఎఫ్‌ఎస్ డి.నాయక్, అటవీ అధికారి రాజేంద్ర సింగ్ మన్రాల్, ఇతర అటవీ ఉద్యోగులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మొసలి బాలుడిని మింగిందేమో అనే అనుమానంతో.. ఖతిమా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఎక్స్ రే తీయించారు. మొసలి కడుపు ఖాళీగా ఉందని అటవీ అధికారులు తెలిపారు. నదిలో చాలా మొసళ్లు ఉన్నాయని.. మరొక మొసలి మింగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ప్రకటించారు. వీర్ సింగ్‌కు అన్నయ్య దీపాంశు అయు (18), ఇద్దరు సోదరీమణులు సీమ (15), అంజలి (14) ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications