వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాను తాకిన ‘మోరా’ పెను తుఫాను, భారీ వర్షాలు : భారత్, బర్మాపై ప్రభావం

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తివంతమైన ‘మోరా’ తుఫాను మంగళవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్ వద్ద తీరాన్ని తాకింది. తీవ్ర వాయుగుండం కారణంగా సోమవారం సాయంత్రం ఏర్పడిన ‘మోరా’ ఉత్తర

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చిట్టగాంగ్: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తివంతమైన 'మోరా' తుఫాను మంగళవారం ఉదయం బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్ వద్ద తీరాన్ని తాకింది. తీవ్ర వాయుగుండం కారణంగా సోమవారం సాయంత్రం ఏర్పడిన 'మోరా' ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ వైపు పయనించింది.

దాదాపు 120 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్న‌ట్లు బంగ్లా వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను కారణంగా బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలుండటంతో సుమారు ప‌ది ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. చిట్టగాంగ్, కాక్ప్ బజార్‌లో అత్యధిక స్థాయిలో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మోరా తుఫాన్ వ‌ల్ల మ‌య‌న్మార్‌, భార‌త్‌లోని కొన్ని ప్రాంతాలు ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.

English summary
Cyclone Mora hits the eastern coast of Bangladesh early on Tuesday, the meteorological department said. After this landfall, the storm is expected to hit the northeastern part of India and Myanmar which will cause damage to the lives and property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X