Cyclone Nisarga:ఫోన్ ఫుల్ చార్జీ చేసి, గ్యాస్ కట్టేయండి, ముంబైకర్లకు బీఎంసీ పలు సూచనలు..
కరోనా వైరస్ దేశ ఆర్థిక రాజధాని ముంబైని చిన్నాభిన్నం చేసింది. 41 వేలకు పైగా పాజిటివ్ కేసులతో అల్లాడిపోతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు నిసర్గ తుఫాన్ వస్తోంది. బుధవారం మధ్యాహ్నం ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో గల అలిబాగ్ నుంచి తీరం దాటనుంది.
తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్‌పై ఉండగా.. ముంబైపై ఎక్కువ చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో ముంబైకర్లు ఏం చేయాలి..? ఏం చేయొద్దు అనే అంశాలపై బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచనలు చేశారు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

ఇలా చేయండి.
1. తుఫాన్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే 1916కి కాల్ చేయాలని సూచన.
2. ఇంటి లోపల ఉండి.. మొబైల్స్, పవర్ బ్యాంక్స్ పూర్తిగా చార్జీ చేసుకోవాలి.
3. టార్చ్ లైట్ చార్జీ చేసి పెట్టుకొండి, క్యాండిల్స్ కూడా అందుబాటులో ఉంచుకొండి.
4. విద్యుత్ సరఫరాకు సంబంధించి మెయిన్ ఆఫ్ చేయండి, గ్యాస్ సఫ్లై కూడా ఆఫ్ చేయండి.
5. విలువైన డాక్యుమెంట్లు, జ్యువెల్లరీ, ఆభరణాలు ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి సీల్ వేయాలని సూచన.
6. కిటికీలకు దూరంగా కూర్చొండి. అలాగే కొన్ని తలుపులు మూసివేసి.. మరికొన్నింటినీ తెరవాలని సూచన. దీంతో గాలి వేగాన్ని నియంత్రించొచ్చు అని తెలిపిన సిబ్బంది.
7. ఇంటిలోపల మధ్యలో ఉండాలని.. కిటికీలు, కార్నర్ల వద్ద ఉంటే గాలి ఒత్తిడికి ఏదైనా వస్తువు పడే అవకాశం ఉంది అని హెచ్చరిక
8. ఇంటిలోపల ఉన్న ఫర్నీచర్, స్టూల్ లాంటి వస్తువులను తాడుతో కట్టాలని సజెస్ట్.
9. గాలి వీస్తున్న సమయంలో మిమ్మల్ని మీరు రక్షించేంుదకు తల, మెడపై చేతులను పెట్టుకోండి.
10. అత్యవసరం కానీ వస్తువులకు పవర్ సప్లై ఆపివేయండి.
11. ఇంట్లో గ్యాస్ లీక్ జరిగితే వెంటనే కిటికీలు తెరవాలని, భవనం నుంచి వెళ్లిపోవాలని సూచన. ఒకవేళ వీలుంటే గ్యాస్ కట్టేసి.. కంపెనీకి సమాచారం ఇవ్వండి.
12. ఇంట్లో విద్యుత్ వైర్లు డ్యామేజీకి గురైతే వెంటనే మెయిన్ పవర్ ఆఫివేయండి. ఎలక్ట్రిషీయన్‌కు ఫోన్ చేయండి.
ఇవీ చేయొద్దు..
1. తుఫాన్ సమయంలో వస్తోన్న రూమర్లను నమ్మొద్దు. భయపడకుండా ఇంట్లోనే ఉండాలి. ఇంతకంటే రక్షితమైన ప్లేస్ మరొటి లేదు.
2. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని, వాహనం నడపొద్దని సూచన.
Recommended Video
3. ఒకవేళ ఇళ్లు దెబ్బతింటే... వెంటనే అందుల్లోంచి బయటకు రావాలని సూచన.
4. తుఫాన్ ప్రభావం దృష్ట్యా.. ఎవరైనా గాయపడితే బయటకు తీసుకెళ్లొద్దు. ఎందుకంటే బయటకు వెళితే మరింత ప్రమాదం ఉండే అవకాశం.
5. ఇంట్లో ఎలాంటి ఆయిల్ కిందపడిన, ఒలికిన వెంటనే శుభ్రపరచాలని సూచన.
ఈ సూచనలను పాటిస్తూ.. తమను తాము తుఫాన్ నుంచి రక్షించుకోవాలని ప్రజలను బీఎంసీ కోరింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications