చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వార్ధా బీభత్సం: చిగురుటాకులా వణుకుతన్న చెన్నై, హెల్ప్ లైన్లు

వార్దా తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను ప్రభావంతో చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది. చెన్నై విమానాశ్రయాన్ని మూసేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: వార్దా తుపాను తమిళనాడు రాజధాని చెన్నై తీరాన్ని దాటింది. అయితే వార్దా ప్రభావంతో చెన్నై, దాని పరిసర జిల్లాల్లో మరో ఆరు గంటలు భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో చెన్నై నగరం చిగురుటాకులా వణుకుతోంది.చెన్నై విమానాశ్రయాన్ని మూసేశారు.

చెన్నై నగరంలో కళ్లముందే విలయం తాండవించింగి, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వృక్షాలు నేల కూలాయి. పట్టపగలే వాహనాలకు లైట్లు వేసుకుని నడుపుతున్నారు. పక్కనున్న మనిషి కూడా కనిపించే పరిస్థితి లేదు. రోడ్లపై మోకాలు లోతు నీరునిలిచింది. దీంతో జనజీవనం స్తంభించింది. ప్రజలు క్షణ క్షణం భయం భయంగాగడుపుతున్నారు. గాలుల తాకిడికి కార్లు, లారీలు తిరగబడ్డాయి. ద్విచక్రవాహనాలు 10 మీటర్లమేర కొట్టుకుపోయాయి.

Vardah Cyclone

తాంపీనగర్, సైదాపేట, ఎన్నూరు తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన మార్గాల్లో నడుం లోతు వరకు నీరుచేరింది. కల్పక్కం అణు విద్యుత్కేంద్రానికి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చెన్నైలో గాలుల హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.

సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నగరంలో 10-15 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తీరంలో సముద్రంలో అల్లకల్లోలంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 176 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.

ఇతర ప్రాంతాల నుంచిచెన్నైకు వచ్చే విమానాలను బెంగళూరు, హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు. సూళ్లూరుపేట సమీపంలో రైలు పట్టాలు దెబ్బతినడంతో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లను గూడూరు. రేణిగుంట మీదుగా మళ్లిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు సైన్యం సిద్ధమైంది. నౌకాదళం, నావికాదళం అప్రమత్తంగా ఉన్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు నావికాదళం హెలికాప్టర్లను సిద్ధం చేసింది

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడు రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలుమణి స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నైలోని 240 చోట్ల వర్షపు నీరు నిలిచిపోయిందని, 69 చోట్ల నీటిని తోడేశామని చెప్పారు. చెన్నై నగరంలో విద్యుత్‌ పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మొబైల్‌ సిగ్నల్స్‌ సైతం కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదని సమాచారం.

వార్దా తుపానుతో అతలాకుతలమవుతున్న చెన్నై నగరవాసుల సహాచార్ధం ప్రభుత్వం హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. ఈ క్రింది నెంబర్ల ద్వారా ప్రజలు సంప్రదించి సహాయం కోరవచ్చని ప్రభుత్వాధికారులు తెలిపారు. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి తమ వంతు సహాయసహకారాలు అందిస్తోంది. హైల్ప్ లైన్లు ఇవే..

044-25619206
044-25619511
044-25384965
044-25383694
044-25367823
044-25387570
9445477207 / 203 / 206

English summary
The cyclone Vardah made landfall with a wind speed of about 130 kmph. The Met department has repeatedly asked people to stay indoors. Roads are flooded in many places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X