వార్ధా బీభత్సం: చెన్నైలో అల్లకల్లోలం, 10మంది మృతి(పిక్చర్స్)
వార్ధా పెను తుఫాను చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసింది. అతి తీవ్రమైన వేగంతో ఈదురుగాలులు ఒకవైపు, ఎడతెరపి లేకుండా మహా కుంభవృష్టి మరోవైపు నగరాన్ని అల్లకల్లోలం చేశాయి.
చెన్నై: వార్ధా పెను తుఫాను చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసింది. అతి తీవ్రమైన వేగంతో ఈదురుగాలులు ఒకవైపు, ఎడతెరపి లేకుండా మహా కుంభవృష్టి మరోవైపు నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. కొట్టుకుపోయిన రోడ్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన కరెంటు తీగలు, కూకటి వేళ్లతో పెకలించుకుపోయిన మహావృక్షాలు నగరంలో వార్ధా విధ్వంసానికి దర్పణం పట్టాయి.
సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు చెన్నై తీరాన్ని తాకిన తుపాను, ఆంధ్రప్రదేశ్‌పై కాస్తంత కనికరం చూపింది. చైన్నైకి సమీపంలో ఉన్న నెల్లూరు, చిత్తూరు నగరాలను భారీ వర్షాలతో సరిపెట్టింది. దీంతో రాష్ట్రానికి పెను విధ్వంసం ముప్పు తప్పింది.
చెన్నైలో తుఫాన్ భీభత్సం పిక్చర్స్
తుపాను ధాటికి ప్రాథమిక సమాచారం ప్రకారం చెన్నైలో 10 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారత వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
చెన్నై నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వార్ధా పొంచి ఉంది. ఏ క్షణంలోనైనా నగరంపై విరుచుకుపడవచ్చు' అని వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర వెల్లడించారు. చెన్నైకి సమీపంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వాచే అవకాశం ఉందని, భారీగా వర్షాలు పడతాయని కూడా ఆయన హెచ్చరించారు.

సీఎం ఆదేశాలు
వాతావరణ శాఖ హెచ్చరిక జారీ అయిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెన్నై నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉత్తర చెన్నై ప్రాంతంలోని దాదాపు 8వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

పునరావాస కేంద్రాలకు తరలింపు
తిరువల్లూరు జిల్లాలోని పాజవెర్కాడు, కాంచీపురం జిల్లాలోని మామల్లపురం(మహాబలిపురం) గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తీసుకెళ్లారు. దూరప్రాంత బస్సులను రద్దు చేశారు.

భయానక వాతావరణం
వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే మధ్యాహ్నం 3గంటల తరువాత తుపాను చెన్నైని విపరీతమైన తీవ్రతతో తాకింది. వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు నగరంలో భయానక వాతావరణం సృష్టించింది. ఈ గాలుల వేగానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. తుపాను తీవ్రతకు సముద్రం దాదాపు పదిహేను అడుగుల మేర ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.

నెలకూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కె.సత్యగోపాల్ అందించిన అధికారిక సమాచారం మేరకు మొత్తం 260 చెట్లు, 37 విద్యుత్ స్తంభాలు, కూలిపోయాయి. 224రోడ్లు ఛిద్రమైపోయాయి. కల్పక్కం అణు ఇంధన కేంద్రంలో అన్ని రక్షణాత్మక చర్యల్ని ముందుగానే తీసుకోవటంతో ప్రమాదం తప్పింది. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు 11 యుద్ధ నౌకలను ముందుగానే సిద్ధంగా ఉంచారు. పదిహేను జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు(ఎన్డీఆర్‌ఎఫ్) తమిళనాడులోని అన్ని తీరప్రాంతాల్లో సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.

పెను గాలులు
చెన్నై జిఎస్‌టి రోడ్డు పెను గాలులు, భారీ వర్షాలకు దారుణంగా దెబ్బతింది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంత జిల్లాలకు పొరుగు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా సమావేశమై అన్నిరకాల సహాయ చర్యలకు అధికారులను ఆదేశించారు. ఇళ్లల్లోంచి ప్రజలెవరూ బయటకు రాకూడదని హెచ్చరించారు.

సెలవులు ప్రకటించారు
రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమ మంగళవారాలు సెలవు ప్రకటించింది. వివిధ అంతర్జాతీయ విమానాలను హైదరాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. దాదాపు 25 అంతర్జాతీయ విమానాలు చెన్నై బదులు హైదరాబాద్, బెంగళూరుల మీదుగా ప్రయాణించాయి. పుదుచ్చేరీ కూడా తుపాను తాకిడికి గురైంది. ఏ క్షణంలోనైనా కదిలేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ తమిళనాడు అరక్కోణంలో, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో సంసిద్ధంగా ఉంచారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవటానికి త్రివిధ దళాల సైనికులు పూర్తి సాధన సంపత్తితో సంసిద్ధంగా ఉన్నారు.

అంధకారంలో చెన్నై
తుపాను కారణంగా చెన్నైలో అంధకారం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్తు సరఫరా నిలిపేశారు. మధ్యాహ్నం నుంచే ఈ పరిస్థితి కనిపించింది. పలు ప్రాంతాల్లో స్తంభాలు కూలిపోవడం, చెట్లు నేలకొరగడంతో సరఫరా పునరుద్ధరించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతానికి అధికారులు మరమ్మతులు చేయడానికి సాహసించడం లేదు. సోమవారం రాత్రి కొన్ని ప్రాంతాలకు మాత్రం పాక్షికంగా సరఫరా పునరుద్ధరించారు.

విమానాశ్రయం మూసివేత.
తుపాను ప్రభావం విమానాశ్రయంపై తీవ్రంగా పడింది. వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో దాన్ని మూసేశారు. చెన్నైకి చేరుకోవాల్సిన 25 విమానాలను బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు మళ్లించారు. ఇక్కణ్నుంచి బయలుదేరాల్సిన మరో పాతిక విమానాలు కూడా నిలిచిపోయాయి. తాంబరం, మీనంబాక్కం ప్రాంతాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. సోమవారం సాయంత్రానికి మీనంబాక్కంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రన్‌వేపైకి భారీ ఎత్తున నీరు చేరుకుంది. విమానాశ్రయ సిబ్బంది ఆగమేఘాలపై నీటిని తోడుతున్నారు. రైలు, బస్సు మార్గాలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications