బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం- ఎంజాయ్

Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం రెండు రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. కర్ణాటక, తమిళనాడుల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతోన్నాయి. బెంగళూరులోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. ఈ తెల్లవారు జాము నుంచి అడపా దడపా వర్షాలు కురుస్తోన్నాయి.

బంగాళాఖాతంలో కన్యాకుమారి నుంచి కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకు విస్తరించిన సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడింది. దీని ప్రభావం వల్ల తమిళనాడు, కర్ణాటకల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అటు కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలైన కాసర్‌గోడ్, వాయనాడ్, కన్నూర్‌లల్లోనూ వర్షపాతం నమోదవుతోంది.

Cyclonic Circulation in Bay of Bengal Bengaluru experienced rainfall

బంగాళాఖాతం ఉపరితలం నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తున విస్తరించి ఉన్న ఈ ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరింత విస్తరించడానికీ అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఈ నెల 6వ తేదీ వరకు వర్షాలు పడొచ్చని తెలిపింది.

బెంగళూరులో ఈ తెల్లవారుజామున తేలికపాటి జల్లులతో మొదలైన వర్షం ఆ తరువాత తీవ్రరూపాన్ని దాల్చింది. యశ్వంత్‌పుర, రాజాజీ నగర, గొరగుంట పాళ్య, పీణ్య, మత్తికెరె, విద్యారణ్యపుర, యలహంక, జాలహళ్లి, సంజయ్ నగర్, భద్రప్ప లేఅవుట్, మార్థహళ్లి, ఈజీపురా, రిచ్మండ్ సర్కిల్, కోరమంగళ, ఎంజీ రోడ్, ఇందిరానగర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, జయనగర వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మధ్యాహ్నం 12:30 గంటల వరకు మార్థహళ్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 26 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్- 15.50, కోరమంగళ- 19.50, బెల్లందూర్-14.50, రామ్మూర్తి నగర- 13, వన్నార్‌పేట్- 11, హెఛ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్ 2లో 10.50 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

Cyclonic Circulation in Bay of Bengal Bengaluru experienced rainfall

దక్షిణ బెంగళూరు (రామనగర), చామరాజనగర, మైసూర్, దక్షిణ కన్నడ, ఉడుపి.. వంటి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు అంటే ఈ నెల 6వ తేదీ వరకు ఉండొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.

అటు తమిళనాడులోనూ ఈ ఆవర్తన ప్రభావం కనిపించింది. చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కోయంబత్తూరు, థేని, పుదుచ్చేరి, కరైకల్‌ సహా తమిళనాడు ఉత్తర ప్రాంత జల్లాలు తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మైలాడుథురై, పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యకుమారి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+