దళపతి విజయ్ లియో సినిమాకు గ్రహాలు అనుకూలించలేదు, రూ కోట్లలో నష్టం వస్తే కథ క్లోజ్ !

బెంగళూరు/చెన్నై: కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ నదీ (cauvery) జలాల వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల సినిమా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చెయ్యకూడదనే డిమాండ్ పై కన్నడ అనుకూల సంస్థలు, రైతు సంఘాలు, స్యాండిల్ వుడ్ సినీ పరిశ్రమతోపాటు కర్ణాటక ప్రజలు కావేరీ (cauvery) మేనేజ్‌మెంట్ అథారిటీపై మండిపడుతున్నారు.

దీని తర్వాత తమిళ సినిమాలపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కర్ణాటకలో విడుదల అవుతున్న తమిళ సినిమాలు కోట్లాది రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. తమిళ సినిమాలు కర్ణాటకలో విడుదలై కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని, అయితే కావేరి (cauvery) నీటి విషయంలో తమిళనాడుకు చెందిన సినీ ప్రముఖులు నోరు విప్పకుండా చోద్యం చూస్తున్నారని స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్, డి బాస్ దర్శన్ బహిరంగంగానే తమిళ సినీ పరిశ్రమ మీద విరుచుకుపడ్డారు.

Dalapathy Vijay starrer Leo trailer, Kannada groups warn to block its release in Karnataka
నటుడు దర్శన్ ఆరోపణలు చేసిన తరువాత బహుబాష నటుడు సిద్ధార్థ్ కొత్త సినిమా 'చిట్ట' ప్రోమోషన్స్ కోసం బెంగళూరులో మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆ సమావేశాన్ని కన్నడ అనుకూల (cauvery) సంస్థలు సగంలోనే ఆపేశారు. ఇన్ని పరిణామాల మధ్య దళపతి విజయ్ (Vijay) నటించిన 'లియో' చిత్రం (Leo) విడుదలకు సిద్ధమైంది. బెంగళూరులో లెక్కలేనన్ని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ ల్లో విడుదల చెయ్యడానికి డిస్టిబ్యూటర్లు సిద్దం అవుతున్నారు.

దళపతి విజయ్ అభిమానులు లియో (cauvery) సినిమా ట్రైలర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. నటుడు విజయ్ (Vijay) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం లియో సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 5వ తేదీన (గురువారం) విడుదల చెయ్యడానికి నిర్మాతలు ఇప్పటికే అన్ని (Karnataka) ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో లియో (Leo) ట్రైలర్ ను అడ్డుకుంటామని కొన్ని కన్నడ సంఘాలు హెచ్చరించాయనే వార్తలు బయటకు రావడంతో విజయ్ ఫ్యాన్స్ హడలిపోయారు.

Dalapathy Vijay starrer Leo trailer, Kannada groups warn to block its release in Karnataka

దళపతి విజయ్ (Vijay) నటించిన లియో (Leo)సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రానికి కర్ణాటకలో మద్దతు లభించడం లేదు. లియో సినిమాపై నిషేధం విధించాలని ఇప్పటికే పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ నటించిన జైలర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను ఊపేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కూడా రజనీకాంత్ జైలర్ సినిమా కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసింది.

తమిళ సినిమాలపై నటుడు దర్శన్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశాడు. కావేరి జలాల కోసం పోరాటం జరుగుతున్న సమయంలోనే తమిళ సినిమాలు కర్ణాటకలో కోట్లాది రూపాయాలు ఎలా వసూలు చేస్తున్నాయని, కన్నడిగులు తమిళ సినిమాలు చూస్తేనే అన్ని కోట్ల డబ్బులు వసూలు అవుతున్నాయా ? అని చాలెంజింగ్ స్టార్ (Leo)దర్శన్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Dalapathy Vijay starrer Leo trailer, Kannada groups warn to block its release in Karnataka

కావేరి పోరాటం విషయంలోనే కన్నడ నటీనటులను విమర్శిస్తున్న (Bengaluru) కొందరు అదే తమిళ సినిమాలను ఎలా ఆదరిస్తున్నారని దర్శన్ ప్రశ్నించారు. కావేరి పోరాటాల ప్రభావం తమిళ సినిమాల మీద ఎందుకు పడటంలేదని దర్శన్ ప్రశ్నించారు. ఈ దెబ్బతో విజయ్ (Vijay) లియో సినిమా మీద ప్రబావం చూపించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇప్పుడు మరోసారి కావేరీ పోరాటం మళ్లీ ఉధృతమయ్యే అవకాశం ఉండటంతో విజయ్ (Vijay) నటించిన లియో (Leo)సినిమా మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉందని సినీ అభిమానులు అంటున్నారు.

అక్టోబర్ 5న లియో ట్రైలర్ రిలీజ్ : ఈ వివాదాల మధ్య ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దళపతి విజయ్ (Vijay) ఫ్యాన్స్ కు లియో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. మీ ఆర్డర్ సిద్ధమవుతోంది లియో (Leo) ట్రైలర్ రాబోతుంది, మీ భోజనాన్ని కడుపునిండా తిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అని పోస్టు చేసింది.

Dalapathy Vijay starrer Leo trailer, Kannada groups warn to block its release in Karnataka

7 స్క్రీన్ స్టూడియో ఈ అక్టోబర్ 5వ తేదీన మీకు డెలివరీ చేస్తుంది అని లియో (Leo)సినిమా నిర్మాత ట్వీట్ చేశారు. లియో సినిమాకు సంచలనాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. లోకేష్ కనగరాజ్ స్టైల్లో యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా లియో (Leo) సినిమా తెరకెక్కింది. లోకేష్, రత్న కుమార్, ధీరజ్ వైది కలిసి లియో సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో దళపతి విజయ్, త్రిషా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషించారు.

అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్ ఇతర పాత్రల్లో నటించారు. లలిత్ కుమార్ మరియు జగదీష్ పళనిసామి లియో సినిమాను నిర్మించగా అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. మొత్తం మీద కర్ణాటకలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లియో (Leo) సినిమా విడుదల కావాలని దళపతి విజయ్ (Vijay) ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+