whatsapp: మీరు సంతోషంగా ఉండండి, మెసేజ్ పంపించి శవమైన డ్యాన్స్ టీచర్, అడవిలో ఏం జరిగింది ?

చెన్నై/ శివగంగై: చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద మమకారంతో ఆమె డ్యాన్స్ మాస్టర్ అయ్యింది. సొంతంగా డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలతో పాటు యువతి, యువకులకు డ్యాన్స్ నేర్పిస్తోంది. డ్యాన్స్ మాస్టర్ కు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం రావడంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు అందరూ సంతోషపడ్డారు. ఓ వైపు సొంతంగా డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూనే మరో వైపు టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. అయితే తన దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్న ఓ యువకుడికి whatsapp మెసేజ్ చేసిన లేడీ టీచర్ ఒక్కసారిగా మాయం అయ్యింది. అటవి ప్రాంతంలో స్కూటీ ఒక చోట పార్క్ చెయ్యడం, మరో చోట ఆమె అనుమానాస్పదంగా చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడంతో కలకలం రేపింది. లేడీ డ్యాన్స్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారా ? ఎవరైనా చంపేసి చెట్టుకు వేలాడదీశారా ? అనే అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 డ్యాన్స్..... డ్యాన్స్..... డ్యాన్స్

డ్యాన్స్..... డ్యాన్స్..... డ్యాన్స్

తమిళనాడులోని శివగంగై జిల్లా కారైకుడి ప్రాంతానికి చెందిన భువనేశ్వరికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఓ గురువు దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న భువనేశ్వరి ఇప్పటి వరకు అనేక ప్రదర్శనలు ఇచ్చింది. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం అయిన భువనేశ్వరి సొంతంగా డ్యాన్స్ స్కూట్ ఏర్పాటు చేసింది.

 ప్రభుత్వ స్కూల్ టీచర్ ఉద్యోగం

ప్రభుత్వ స్కూల్ టీచర్ ఉద్యోగం

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో భువనేశ్వరికి ఉద్యోగం వచ్చింది. అగ్నిమాపక శాఖలో ఉద్యోగం చేస్తున్న కందియప్పన్ అనే వ్యక్తితో భువనేశ్వరికి వివాహం అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సొంతంగా నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్ లో పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలకు భువనేశ్వరి డ్యాన్స్ నేర్పిస్తున్నది. డ్యాన్స్ స్కూల్ కు వచ్చి డ్యాన్స్ నేర్చుకునే విద్యార్థులతో డ్యాన్స్ మాస్టర్ భువనేశ్వరి చాల సంతోషంగా ఉత్సహాంగా చనువుగా ఉండేదని తెలిసింది.

 వాట్సాప్ మెసేజ్ తో షాక్

వాట్సాప్ మెసేజ్ తో షాక్

భువనేశ్వరి ఆమె మొబైల్ ఫోన్ నుంచి డ్యాన్స్ స్కూల్ లో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఓ యువకుడికి వాట్సాప్ లో ఓ మెసేజ్ పంపించారు. డ్యాన్స్ మాస్టర్ భువనేశ్వరి పంపించిన వాట్సాప్ మెసేజ్ లో ‘ఇక ముందు తాను ఎవ్వరికీ భారం కాను, అందరూ సంతోషంగా ఉండండి' అని మాత్రమే ఉంది. డ్యాన్స్ మాస్టర్ వాట్సాప్ లో పంపించిన మెసేజ్ చూసి షాక్ అయిన ఆ యువకుడు వెంటనే భువనేశ్వరి భర్త కందియప్పన్ కు సమాచారం ఇచ్చాడు.

 ఫోన్ రింగ్ అయ్యింది.... కాని ?

ఫోన్ రింగ్ అయ్యింది.... కాని ?

డ్యాన్స్ స్కూల్ ఇచ్చిన సమాచారంతో ఆందోళనకు గురైన కందియప్పన్ వెంటనే భార్య భువనేశ్వరి మొబైల్ కు ఫోన్ చేశాడు. ఫోన్ పూర్తిగా రింగ్ అయినా భువనేశ్వరి ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. భార్య భువనేశ్వరి మొబైల్ ఫోన్ కు పదేపదే ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యకపోవడంతో మరింత ఆందోళనకు గురైన కందియప్పన్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    Janasena మేనిఫెస్టో హామీ కి.. నూతన విద్యా విధానం 2020 లో చోటు ! || Oneindia Telugu
     అడవిలో చెట్టుకు భువనేశ్వరి శవం

    అడవిలో చెట్టుకు భువనేశ్వరి శవం

    పోలీసులు, భర్త కందియప్పన్, డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు డ్యాన్స్ మాస్టర్ భువనేశ్వరి కోసం గాలించారు. కారైకుడి- తిరుచ్చి జాతీయ రహదారి సిగ్నల్ సమీపంలో భువనేశ్వరి స్కూటీ పార్క్ చేసిన ఉన్న విషయం వెలుగు చూసింది. వెంటనే హైవే రోడ్డు సమీపంలోని అటవి ప్రాంతంలో గాలించగా ఓ చెట్టుకు భువనేశ్వరి శవమై వేలాడుతూ కనిపించింది.

     ఏం జరిగింది ? ఎవరైనా చంపేశారా

    ఏం జరిగింది ? ఎవరైనా చంపేశారా

    పోలీసులు భువనేశ్వరి మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భువనేశ్వరికి, ఆమె భర్త కందియప్పన్ కు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. భువనేశ్వరి ఎందుకు ఆమె దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్న విద్యార్థికి వాట్సాప్ లో మెసేజ్ పంపించింది ? కుటుంబ గొడవలు ఏమైనా ఉన్నాయా, భువనేశ్వరి ఆత్మహత్య చేసుకుందా ? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా ?, అక్రమ సంబంధం గొడవలు ఏమైనా ఉన్నాయా ? అంటూ పోలీసులు విచారణ చేస్తున్నారు. వందల మందికి డ్యాన్స్ నేర్పించి అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ టీచర్ భువనేశ్వరి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడంతో కారైకుడి ప్రాంతంలో కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+